కారు కొన్న మ‌రో బిగ్ బాస్ కంటెస్టెంట్.. శుభాకాంక్ష‌లు తెలిపిన మోనాల్, సోహెల్‌

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డం ఏమో కాని కంటెస్టెంట్స్ జీవితాల‌కు మాత్రం ఓ మార్గం చూపిస్తుంది. బిగ్ బాస్ షోకు ముందు ఎవరో తెలియ‌ని వారు కూడా ఇప్పుడు సెల‌బ్రిటీలుగా మార‌డ‌మే కాక వ‌రుస షోస్‌తో అల‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో నాలుగు పైస‌లు వెనుకేసుకోవ‌డం, ఇల్లు,కారు వంటివి కొన‌డం చేస్తున్నారు. గ‌త బిగ్ బాస్ సీజ‌న్‌ల‌లో పాల్గొన్న హిమ‌జ‌, శివ‌జ్యోతిలు కాస్ట్‌లీ కార్స్ కొనుగోలు చేసి ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

ఇక సీజ‌న్ 4 విష‌యానికి వ‌స్తే క‌రోనా స‌మ‌యంలోను స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిచిన ఈ షో అన్ని సీజ‌న్స్‌లో క‌న్నా ప్ర‌త్యేకంగా నిలిచింది. బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు సెల‌బ్రిటీలుగా మార‌డ‌మే కాకుండా ప‌లు షోల‌తో అల‌రిస్తున్నారు. అంతేకాదు వెండితెర‌పై న‌టించే అరుదైన అవ‌కాశాల‌ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇప్ప‌టికే మోనాల్‌, అరియానా, అఖిల్‌, సోహెల్ వంటి సినిమా ఆఫ‌ర్స్ అందుకోగా త్వ‌ర‌లో వీరి మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

బిగ్ బాస్ సీజ‌న్ 4 ర‌న్న‌ర‌ప్ అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.మోనాల్‌తో పులిహోర క‌లుపుతూ ఫుల్ ఫేమ‌స్ అయిన అఖిల్ తాజాగా కాస్ట్‌లీ కారు కొన్నాడు. 25 ఏళ్ల‌లోపు కారు కొంటాన‌ని ప్రామిస్ చేసిన నేను ఇప్పుడ‌ది సాధించాను. క‌ష్టం , హార్డ్ వర్క్ వ‌ల‌న‌నే ఇది సాధ్య‌మైంద‌ని త‌న ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. అతనికి సోహెల్‌, ఆర్జే చైతూ, మోనాల్ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం మోనాల్‌తో క‌లిసి తెలుగు అబ్బాయి, గుజ‌రాతీ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అలానే ప‌లు సినిమాల‌లోను న‌టిస్తున్నాడు.