హైదరాబాద్ రాయదుర్గంలోని లాంకోహిల్స్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. 15 అంతస్థుల పైనుంచి దూకడంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే నందిగామకు చెందిన మల్లికా అనే యువతి మూడు నెలల క్రితం నుంచి అదే లాంకోహిల్స లో పని మనిషిగా పనిచేస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంటికి తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు తిరిగి వస్తానని ఫోన్ చేసింది. కానీ లాక్ డౌన్ తో ఎటూ కదలలేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా రావొద్దని అక్కడే ఉండమని కోరారు. అయినా ఆ యువతి ఇంటికి వెళ్లే ప్రయత్నాలు మానుకోలేదు.
ఎంతకీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంటికి వెళ్లలేక..పనిచేసే చోట ఉండలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అనుమానదస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ లో ఈనెల 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కేంద్రం నాలుగో దశ లాక్ డౌన్ కి సిద్దమవుతోంది. అయితే కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వలస కూలీలు, విద్యార్థులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంతలోనే మల్లిక తొందరపడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనస్థాపానికి గురవ్వడానికి లాక్ డౌన్ కారణమా? లేక ఇంట్లో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ చేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లోను కేసు దర్యాప్తుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు హైవే రోడ్ల వెంబడి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్లలో కొంత మంది సొమ్మసిల్లి పడిపోవడం…మృత్యువాత పడటం జరుగుతోంది. ఇటీవలే ఔరంగాబాద్ లో 17 మంది వలస కూలీలు రైల్లే పట్టాలపై నిద్రిస్తోన్న సమయంలో గూడ్స్ రైలు ఎక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే.