Crime News: ఈ మధ్య కాలంలో యువత మద్యపానం, ధూమపానం, గంజాయి తీసుకోవటం వంటి చెడు వ్యసనాలకు బాగా అలవాటు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో యువత వీటిని సేవించడం ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు.ఇటీవల ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులను తన పద్దతి మార్చుకోవాలంటూ వారించిన గ్రామ వాలంటీర్ మీద కక్ష పెంచుకున్న యువకులు అతని మీద దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం గా మారింది.
వివరాల్లోకి వెళితే…శ్రీకాకుళం నగరంలోని గూనపాలెంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గుణ పాలెం లో డిఎస్‌పి కార్యాలయానికి దగ్గరలో పట్టపగలు కొందరు యువకులు కనకరాజు అనే గ్రామ వాలంటీర్ మీద కర్రలతో దాడికి పాల్పడ్డారు.
తన దగ్గరి బంధువు హరి ఇంటి బయట హరి, రోణితో మధ్యాహుం 12 గంటల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఒక తుపాకీ, ఒక గొడ్డలితో ఆరుగురు యువకులు అక్కడి వచ్చారు. గొడ్డలితో కనకరాజుపై విక్షణారహితంగా దాడి చేశారు. మెడ, తల వెనుక భాగంలో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అడ్డుబోయిన హరిపైనా ఆ యువకులు దాడి చేశారు. దీంతో, హరి తీవ్రంగా గాయపడ్డాడు. రోణిపై తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే, అది పేలకపోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులు తరచూ గ్రామంలో గంజాయి సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఉండేవారు. వీరి చర్యలకు విసుగుచెందిన స్థానికులు, వాలంటీర్ కలిసి వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు యువతరం పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.వారి మీద ఫిర్యాదు చేసేందుకు వాలంటీర్ మీద యువకులు కక్ష పెంచుకున్నారు.
ఈ క్రమంలో కనకరాజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన బంధువులైన హరి,రోణిఅను వ్యక్తి తో మాట్లాడుతున్న సమయంలోఆరుగురు యువకులు తుపాకీ గొడవలు తీసుకొనివచ్చి కనకరాజు పై విచక్షణ రహితంగా కొడవళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో కనకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హరి అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.రోణి అనే వ్యక్తి మీద కూడా గార్లతో కాల్పులు జరిపారని ప్రయత్నించగా అది వెళ్లకపోవడంతో యువకులు అక్కడి నుండి పరారయ్యారు.