Husband: భర్తకు హెచ్ఐవి సోకిందని తెలిసి ఈ భార్య చేసిన పని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు..!

Husband: ఒడిస్సాలోని భద్రక్ జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. భద్రక్ జిల్లా బొంత్ తాలూకాలో జరిగిన ఈ సంఘటన గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సాధారణంగా భర్తకి అనారోగ్యంగా ఉంటే ఏ భార్య అయినా దగ్గర ఉండి భర్తకు సేవలు చేస్తుంది. కానీ విచిత్రంగా ఒక మహిళ ఆమె భర్తకు హెచ్ఐవి సోకిందని తెలిసి అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే .

3 సంవత్సరాల క్రితం ఆ దంపతులిద్దరికీ వివాహమయింది, వారికి ఒక పాప కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె భర్త గ్రామం చివరిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశాడు. డాక్టర్లు ఆయన రక్తాన్ని పరీక్షించగా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. డాక్టర్ ఆయనను కలవమని ఫోన్ చేయగా సదరు భర్త హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలిశారు. అప్పుడు ఆ భర్తకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ తెలియజేశారు. ఇంటికి వచ్చి ఈ విషయం ఆయన భార్యతో చెప్పగా వెంటనే ఆవిడ బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

కష్టాల్లో భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య ఆయన అనారోగ్యం గురించి తెలిసి పుట్టింటికి వెళ్ళి పోవడంపై అందరూ చెప్పిన ఆమె వినిపించుకోకుండా సదరు భర్తపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ విషయంపై పోలీసులు ఆమెను విచారించగా ఏమాత్రం సంబంధం లేకుండా తన అత్తింటివారు, భర్త కలిసి అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేకే ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళి పోయానని ఆమె వాదన వినిపించింది..భర్త అత్తమామలు తనని వేధిస్తున్నారని వారిపై కంప్లైంట్ చేసి పెళ్లి సమయంలో తను ఇచ్చిన బంగారం, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఆమె అత్తను విచారించగా తాను కోడల్ని ఎటువంటి ఏ విధంగా హింసించలేదని ఇలా కొడుకును వదిలి పుట్టింటికి వెళ్ళి పోవడం మంచిదికాదని ఎంత సర్ది చెప్పినా ఆమె వినిపించుకోవడం లేదని ఆమె అత్త వాపోయారు. తమ కోడలు తమతోనే ఉండాలని ఆవిడ ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ఐవి ఒక కుటుంబంలో కల్లోలం సృష్టించి భార్య భర్తల ను దూరం చేసింది.