Crime News: చాలా మంది కష్టపడి పని చేయటానికి బద్దకించి సులభంగా డబ్బు సంపాదించడం కోసం అనేక మార్గాలను వెతుక్కుంటారు. అలాగే సులభంగా డబ్బు సంపాదించడం కోసం కొంతమంది దొంగతనాలు ఏం చేస్తున్నారు. దొంగతనాలు చేయడానికి చాలా పద్ధతిగా పథకం వేసినప్పటికీ కొన్నిసార్లు అవి విఫలమవుతూ ఉంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే…జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో ఊరికి చివరిగా ఉన్న జామి ఎల్లమ్మ దేవాలయం దొంగతనం చేయటానికి ప్రయత్నించిన వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి మంగళవారం తెల్లవారు ఝూమున అమ్మవారి ఆలయంలో దొంగతనం చేయటానికి కిటికీ పగులకొట్టి గుడిలోకి ప్రవేశించాడు. అమ్మవారి నగలు, విలువైన వస్తువులు దొంగలించాడు.
తిరిగి అదే కిటికీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆ దొంగ దురదృష్టమో… అమ్మవారి మహత్యమో తెలియదు కానీ లోపలకు వెళ్లిన పాపారావు కిటికీ లో ఇరుక్కుపోయి బయటికి రాలేక తంటాలు పడ్డాడు.
ఈ లోగా గ్రామస్తులు అతనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపు అతనిని కిటికీ నుండి బయటకి తీసి దేహశుద్ధి చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అతని మీద కేసు నమోదు చేసుకున్నారు.