AP: ఏడు నెలల కూటమి పాలన పై షాకింగ్ సర్వే…. జనాభిప్రయం ఏమిటంటే?

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడు నెలలు పూర్తి అయింది. ఈ ఏడు నెలల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయం ఏంటి ఈ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనే విషయాలపై సర్వే నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ కూటమి పార్టీలకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టాయి ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ పాలన గురించి ప్రజా నిర్ణయం ఏంటి అని సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో భాగంగా ప్రజల అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించినట్లు ఆర్టీజీఎస్ సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఇలా గ్రామస్థాయి మండల స్థాయిలో ప్రజలను కూటమి పాలన గురించి ప్రశ్నించగా దాదాపు ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడారని ఈ సర్వేలో వెల్లడి అయింది ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు పథకం గురించి ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఏడు నెలలు అవుతున్న అమలు పరచలేదు కేవలం పెన్షన్ మాత్రమే అమలుపరిచారు. ఇక ఇటీవల తాను సంక్షేమ పథకాలను అందించడానికి తన దగ్గర డబ్బులు లేవు అంటూ ఈయన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేమని చెప్పకనే చెప్పేశారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్లినా అధికారులు లంచం అడగటం ఉచిత ఇసుక మద్యంపై భారీగా అధికారులు ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి.

ఇక ఈ విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు అలాగే గ్రామస్థాయిలో మరోసారి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మారుమోగుతుందనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి ఎన్నో సంక్షేమ పథకాలు మాకు వచ్చేవనే ఆలోచన గ్రామస్థాయి ప్రజలలో ఉందని దీంతో మరోసారి జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ కూడా పెరుగుతుందని వెల్లడించారు.

ఇలా ఏడు నెలల కూటమి పాలన పై సర్వేలో షాకింగ్ విషయాలు బయటకు రావడంతో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి కూడా ఇదే విషయంపై మంత్రులను అలాగే అధికారులకు దిశా నిర్దేశాలు చేయడమే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.