పైడ్ ఆర్టిస్ట్ ల ఉద్యమం వైసీపీదా! లేక టీడీపీదా!

tdp and ysrcp leaders dispute leads to tarnish of andhra pradesh reputation

ఏపీలో ఇప్పుడు ఉద్యమాల రాజకీయం, కక్ష్య సాధింపు రాజకీయాలు సాగుతున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ప్రతిపక్షాలు మరీ పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యలను పట్టించుకోవటం పక్కన పెట్టిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెల్లబొచ్చుతున్నారు. ఇప్పుడు ప్రజలను కూడా ఈ కక్ష్య సాధింపు రాజకీయాల్లోకి లాగుతున్నారు. అమరావతి నుండి రాజధానిని మారుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమానికి దిగారు. ఈ ఉద్యమం ప్రారంభం అయ్యి దాదాపు 300రోజులు దాటింది. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఈ ఉద్యమాన్ని పైడ్ ఆర్టిస్ట్ ల ఉద్యమమని వ్యాఖ్యానిస్తున్నారు.

ఎవరు పైడ్ ఆర్టిస్ట్ లతో ఉద్యమం చేస్తున్నారు?

అమరావతి రైతులకు ధీటుగా ఇప్పుడు అక్కడే ఇంకో ఉద్యమం ప్రారంభం అయ్యింది. ఇళ్ల స్థలాల పంపిణీని టీడీపీ నేతలు అడ్డుకున్నందుకు నిరసనగా ఉద్యమం చేస్తున్నామని ఉద్యమ కారులు చెప్తున్నారు. ఈ ఉద్యమాన్ని చూసిన టీడీపీ నేతలు అది పైడ్ ఆర్టిస్ట్ లతో చేస్తున్న ఉద్యమమని అంటున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే “ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని బేతపూడి అని చెప్పాలని, ఇళ్ల స్థలాల పంపిణీని టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని” చెప్పాలంటూ వైసీపీ నాయకులు అక్కడ ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో అసలైన పైడ్ ఆర్టిస్టుల ఉద్యమం వైసీపీ ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియోను చూసిన జనం అక్కడ ఎవరు నిజమైన ఉద్యమం చేస్తున్నారో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. అమరావతి రైతులది పైడ్ ఉద్యమమా లేక ఇళ్ల స్థలాల కోసం వచ్చిన వారిది పైడ్ ఉద్యమమా అనేది కాలమే నిర్ణయించాలి.

అమరావతి రైతులను ప్రభుత్వం పట్టించుకోదా!!

అమరావతి రైతుల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణమైన తీరును కనపరుస్తున్నారు. టీడీపీపైన ఉన్న కోపంతో అమరావతి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రైతులు ఉద్యమం చేస్తూ 300 రోజులు దాటింది అయినా కూడా ప్రభుత్వం వారితో కనీసం చర్చలు కూడా జరపడం లేదు. కనీసం చర్చలు కూడా జరపకపోవడానికి వైసీపీ దగ్గర ఉన్న కారణాలేంటో కూడా ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ వెనక టీడీపీ నాయకులు ఉన్నారన్నది నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు కానీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారన్నది మాత్రం నిజం. అలాంటి రైతుల పట్ల ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం చాలా తప్పు.