Tirumala: తిరుమల కొండపై ఇటీవల వరుసగా అపచారాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తిరుపతి ఏదో ఒక విషయం ద్వారా వివాదంలో నిలుస్తోంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో వరుసగా ఆపచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా తిరుమల కొండపై ఓ ముస్లిం వ్యక్తీ ఏకంగా నమాజ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండపై భద్రత లోపం జరుగుతోందనడానికి ఈ వీడియో నిదర్శనం అని చెప్పాలి. తిరుమల కొండపై అన్యమతస్తులకు చెందిన ఫొటోలు, లాకర్లు, చిత్ర పటాలు నిషేధం. ఇతర మతస్తులు ప్రార్థనలు చేయటం కూడా నిషేధం. అలాంటి పవిత్రమైన కొండపై ముస్లిం వ్యక్తి వెళ్లి నమాజ్ చేయటం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అని చెప్పాలి.
తిరుమల కొండపైన.. అది కూడా పురోహితుల సంఘం భవనం ఉన్న చోట.. నమాజ్ చేయటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో రావటం చర్చనీయాంశం అయ్యింది.పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. 10 నిమిషాల పాటు ముస్లిం మతానికి చెందిన వ్యక్తి … సీసీ కెమెరాలకి ఎదురుగానే నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా కలియుగ దైవమైన సాక్షాత్తు తిరుమల కొండపైనే ఇలాంటి అపచారం జరుగుతుంటే సనాతన ధర్మం అని వాదించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ మరికొందరు ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ని కూడా లాగుతున్నారు. అయితే ఇప్పటివరకు తిరుమల కొండపై నమాజ్ చేసిన వ్యక్తి ఎవరు ఏంటి అని వివరాలు మాత్రం తెలియడం లేదు.