Crime News: ఈ మధ్యకాలంలో సినిమా ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి సినిమాని ఏదో ఒక ఇంటెన్షన్ తో మంచి మెసేజ్ ఇవ్వడానికి రెడీ డైరెక్టర్ ప్రయత్నం చేస్తాడు. సినిమాలో ఉన్న మంచిని గ్రహించి దానిని ఫాలో అవకుండా, సినిమా లో ఉన్న చెడుని మాత్రం బాగా అనుసరిస్తారు. ఈ మధ్యకాలంలో సినిమా స్టైల్ లో చాలా వరకు దొంగతనాలు హత్యలు జరుగుతున్నాయి. సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. దొంగలు చేస్తున్న పొరపాటు ఏమిటంటే వారితో పాటు పోలీసులు కూడా ఆ సినిమాలని చూసి ఉంటారు అన్న జ్ఞానం లేకుండా సినిమా స్టైల్ లో దొంగతనాలు చేస్తూ ఉంటారు.
తాజాగా విడుదలైన పుష్ప సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎర్రచందనం మద్యం చేస్తూ ఒక వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాలలోకి వెళితే..యాసిన్ ఇనయాతుల్లా అను వ్యక్తి ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేశాడు. పుష్ప సినిమాలో చూపించినట్టుగా ఎర్రచందనం దుంగల్ని ట్రక్కులో ఉంచి పోలీసులకు అనుమానం రాకుండా వాటిమీద కూరగాయలు, పండ్లు బాక్సులను ఉంచాడు. పైగా తన తెలివిని ఉపయోగించి ఆ ట్రక్కకు
Covid -19 నిత్యవసర సరుకులు అని ఒక స్టిక్కర్ కూడా అతికించాడు.
యాసీన్ ఇనాయతుల్లా ఇలా తన తెలివితో ఆంధ్ర లోని అన్ని చెక్ పోస్టులు దాటి మహారాష్ట్ర లోకి ప్రవేశించాడు. కానీ అతని అదృష్టం బాగోలేక సంగ్లీ జిల్లాలోని గాంధీచౌక్ వద్దకు రాగానే అక్కడ పోలీసులు ఆపి ట్రక్కుని చెక్ చేశారు. పోలీసులు అలా చేయటంతో మనోడి భాగోతం మొత్తం బయట పడింది. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను దాదాపు రూ2.45 కోట్ల విలువగల ఎర్రచందనాన్ని తరలిస్తునట్టు పోలీసులు అంచనా వేశారు. యాసీన్ దగ్గరినుండి ట్రక్కునీ, ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.