Crime: ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్న ఒక ఆకతాయి వ్యక్తి..అసలేం జరిగిందంటే..?

Crime: సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత జనరేషన్ లో మాత్రం యువత చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ఇంట్లో పరిస్థితులు బాగాలేవని ఇలా చిన్న చిన్న కారణాలతో జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అయితే పిల్లలు మంచి పని చేసినా, చెడ్డ పని చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేది తల్లిదండ్రుల గురించి. కొందరు ఆకతాయిలు అల్లరిగా ఉంటూ జులాయి చేస్టలతో తిరుగుతూ ఉంటే తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు అని నిందిస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుమారుడి వ్యవహార శైలి బాగోలేదని స్థానికులు తండ్రికి చెప్పడంతో తండ్రి కొడుకుని మందలించాడు. దీంతో కొడుకు తండ్రిని బెదిరించడం కోసం చెరువులోకి దూకాడు. కొడుకును కాపాడుకునే కోసం తండ్రి అతనితో పాటు మరొక వ్యక్తి చెరువులోకి దూరి బలయ్యారు. కానీ కొడుకు మాత్రం ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే.. హనుమకొండ జిల్లా లోని ఐనవోలు మండలం ముల్కల గూడెం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే విజేందర్ కుమారుడు శ్రావణ్ వ్యవహార శైలి బాగా లేకపోవడంతో స్థానికులు అతనికి ఫిర్యాదు చేశారు.

శ్రావణ్ జులాయి చేష్టలతో విసిగిపోతున్నామంటూ స్థానికులు విజేందర్ కు ఫిర్యాదు చేయడంతో, వెంటనే విజేందర్ కుమారుడికి ఫోన్ చేసి మందలించాడు. దీనితో శ్రావణ్ నన్ను ఇలా అంటారా? నేను ప్రస్తుతం చెరువు వద్ద ఉన్నాను దూకి చనిపోతాను అంటూ శ్రావణ్ చెప్పడంతో.. అప్పుడు విజయేందర్ కొడుకు అన్నంత పని చేస్తాడు అని భయంతో గ్రామ సమీపంలోని చెరువు దగ్గరికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆయనకు అన్న కుమారుడు అయినా శోభన్ ను కూడా తన వెంట తీసుకెళ్లాడు. వీరిద్దరూ చెరువుగట్టు కు వెళ్లే సమయంలో వారిద్దరి చూసిన శ్రావణ్ నీటి లోకి దూకాడు. శ్రావణ్ రక్షించడం కోసం విజేందర్,శోభన్ ఇద్దరు నీటిలోకి దిగి గల్లంతయ్యారు. శ్రావణ్ కు ఈత రావడంతో ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు గజ ఈతగాళ్లను పిలిపించి చెరువు మొత్తం గాలించి మృతదేహాలు బయటికి తీశారు. శ్రావణ్ చేసిన పనికి తండ్రి విజేందర్ అలాగే అన్న వరస అయ్యే శోభన్ అనే వ్యక్తి ఇద్దరూ బలయ్యారు.