Tea Glass: సాధారణంగా మనం చిన్న పిల్లలు ఏదైనా వస్తువులతో ఆడుకుంటూ ఉంటే వారిని మన పదే పదే గమనిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు ఏదైనా వస్తువులను నోట్లో పెట్టుకుని మింగుతారేమోనని పెద్దలు కనిపెట్టుకుని ఉంటారు. ఇలా చిన్న పిల్లల పొరపాటున ఏదైనా వస్తువులను మింగుతూ ఉంటారు. చిన్నపిల్లలు కాయిన్స్ మింగడం, లేదా ఏదైనా క్యాప్స్ మింగడం గురించి మనం వింటూనే ఉన్నాం.
కానీ 58 సంవత్సరాల వ్యక్తి ఏదైనా వస్తువులని మింగారు అంటే మనం నమ్మం. కానీ నిజంగానే ఆ వ్యక్తి కడుపులో ఉన్న గ్లాస్ ను చూసి డాక్టర్లకే మతి పోయిన ఘటన బిహార్ లోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 సంవత్సరాల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటం ఆస్పత్రికి వెళ్లారు
అతనికి సిటీ స్కాన్ చేయించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని కడుపులో టీ గ్లాస్ ఉండటం చూసి డాక్టర్లకు గ్లాస్ ఎలా వెళ్ళిందో తెలియక తికమక పడ్డారు. ఈ విషయం గురించి ఆ వ్యక్తిని అడగగా టీతో పాటు గ్లాసు కూడా మింగానని చెప్పడంతో డాక్టర్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే ముందుగా డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా ఆ గ్లాస్ ను బయటకు తీయాలని ప్రయత్నించారు. అయితే కుదరకపోవడంతో చివరికి ఆపరేషన్ ద్వారా ఆ గ్లాస్ ను బయటకు తీసినట్లు వైద్యులు వెల్లడించారు. టీ తో పాటు గ్లాస్ కూడా తాగారా అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.