Crime: దారుణం: గొడ్డలితో తల నరికి తల పట్టుకుని ఊరంతా తిరిగిన వ్యక్తి.. ఎక్కడో తెలుసా..?

Crime: రోజురోజుకీ సమాజంలో మానవత్వం అన్నది కరువైపోతుంది. నిత్యం సమాజంలో ఎన్నో నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యలు, హత్యలు, అఘాయిత్యాలు ఇలాంటి విషయాలకు సంబంధించిన ఘటనలను తరచుగా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఘటనలో కొన్నింటిని తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుతోంది. అంత దారుణంగా మనుషులు మానవత్వం అన్నది మరిచి హత్యలకు దాడులకు దిగుతున్నారు. తాజాగా ఒడిశాలో కూడా ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా బాజ్ పూర్ జిల్లా జమాంకిర మండలంలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక హత్యకు గురయింది. తాజాగా శుక్రవారం రోజున తెల్లవారుజామున సమయంలో మల విసర్జన కోసం అనే ఈ సదరు బాలిక పొలం వద్దకు వెళ్ళింది..

అప్పటికే 30 ఏళ్ల వ్యక్తి అక్కడికి గొడ్డలితో చేరుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, ఎనిమిదేళ్ల బాలిక రాగానే ఆ బాలిక పై విరుచుకుపడి గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం తలను మొండెం వేరు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కిరాతకుడు ఆ బాలిక తల పట్టుకుని ఊరంతా తిరిగాడు. అతడిని చూసిన గ్రామస్తులు భయంతో వణికి పోయాడు. ఇక బాలిక తలను చేతపట్టుకుని నేరుగా గ్రామంలో ఉన్న బావి వద్దకు వెళ్లి తల పక్కనబెట్టి రక్తంతో తడిసిన తన చేతులను కడుక్కుంటుండగా ఇంతలో అతని భార్య అక్కడికి చేరుకొని అతడితో గొడవకు దిగింది. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా చంపేస్తాను అంటూ ఆమె కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నేలపై పడుకుని నిద్ర పోయాడు.

స్థానికుల మెదక్ కు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతదేహాన్ని మార్చురికి పంపించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అతడు తరచుగా డ్రగ్స్ తీసుకునే వాడని, దీంతో అతను డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని, కానీ ఆ పసిపాపను ఎందుకు చంపాల్సి వచ్చిందో పోలీసులకు కూడా అంతుపట్టడం లేదు. కానీ సదరు బాలిక కుటుంబానికి అతనికి గొడవలు జరిగాయని, అప్పుడప్పుడు వారితో గొడవలు కూడా జరిగేవని స్థానికులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఆ ఎనిమిదేళ్ల పసి పాపను అంత ఘోరాతి ఘోరంగా చంపడంతో గ్రామస్తులు మునిగిపోయాడు. ఆ చిన్నారి మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా అటువంటి నరరూప రాక్షసులను కటినంగా శిక్షించాలి అని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.