Crime News: ప్రస్తుత కాలంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. చదువుకున్న వారు తమ తెలివి తేటలు ఉపయోగించి ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ వారి ఆగడాలకు ఎప్పుడో ఒకసారి కచ్చితంగా అడ్డు కట్ట పడక తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి తిరిగి చెల్లించకుండ మాయ మాటలు చెప్పి మోసం చేశాడు ఒక ప్రభుద్దుడు. మోసపోయే వారు ఉంటే మోసం చేసేవారికి కొదువ అన్నట్టు నిందితుడు మహిళలను మోసం చేశాడు.
వివరాలలోకి వెళితే..ఖమ్మం జిల్లా వెంకటాపురం మధిర (ప్రస్తుతం కూకట్‌పల్లి, హైదరాబాద్)కు చెందిన వాసిరెడ్డి
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురితో గత కొన్ని సంవత్సరాలుగా పరిచయాలు పెంచుకుని వారి నుండి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో సుల్తానాబాద్ కు కి చెందిన ఒక మహిళ భర్త మరణించడంతో రెండవ వివాహం కోసం మాట్రిమోని లో వివరాలు ఉంచింది. ఇదే అదునుగా భావించిన వాసిరెడ్డి మహిళను మోసం చేయాలని భావించి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ15.5 లక్షల రూపాయలు ఆమె నుండి తీసుకున్నాడు. అంతేకాకుండా అత్యవసరం అంటూ అయిదున్నర తులాల బంగారాన్ని కూడా ఆమె నుండి తీసుకొని ముత్తూట్ ఫైనాన్స్లో కుదువపెట్టి లక్ష 30 వేల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. డబ్బు తీసుకున్న కొన్ని నెలలు కొద్ది కొద్దిగా డబ్బు చెల్లించి తర్వాత డబ్బులు చెల్లించకుండా ఆమెను మోసం చేశాడు.
తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు మూడు టీములుగా నిందితుల కోసం గాలించి అరెస్టు చేశారు. పోలీసులు తమ పద్ధతిలో నిందితుడిని విచారించగా మొత్తం ఈ విషయం బయటపడింది. ఇలా మహిళలను మాత్రమే కాకుండా తన స్నేహితులని సైతం బురిడీ కొట్టించి వారి దగ్గర నుండి డబ్బు తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశాడు అని పోలీసులు వెల్లడించారు. మోసం చేయటమే వృత్తిగా ఎంచుకున్నారు సదరు నిందితుడు పలువురి దగ్గర అప్పు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేశాడు. ఇలా దాదాపు కోటి రూపాయల పైనే డబ్బు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేశాడు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను ఆన్లైన్లో ఉంచడం వల్లే ఇలాంటి ఇ నిజాలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు ఇలాంటి పొరపాటు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.