నెల చివరి వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తిస్థాయి నిషేధం..

గతంలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా కూడా దేశంలో ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గలేదు. కొన్ని చోట్ల మాత్రం ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించగా మరికొన్ని చోట్ల మాత్రం వాడుకలోనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కేంద్రం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి అని ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఈ నెల చివరి వరకు పూర్తిగా నిర్మూలించాలి అని కేంద్రం సూచించింది. ఇప్పటికే 2,591 మున్సిపాలిటీలు నిషేధాన్ని అమలు చేయగా.. 2,100 మున్సిపాలిటీలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలి అని ప్రకటించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించాలి అని కేంద్రం స్పష్టం చేసింది.