సాధారణంగా ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు నియమాలను పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. అయినప్పటికీ కొన్ని వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. వస్తువులు కూడా వాస్తు ప్రకారం లేకపోతే వాస్తు దోషం వల్ల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం కాకుండా ఎక్కడపడితే అక్కడ వచ్చేటప్పుడు ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. ముఖ్యంగా నిద్రించే స్థలంలో కొన్ని వస్తువులను ఉంచటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.
చీపురు: సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఇంట్లో బెడ్ రూమ్ సెపరేట్ గా ఉంటుంది. పడక గదిలో మంచం లేదా నిద్రించే ప్రదేశంలో చీపురు ఉంచడం చాలా అశుభం. ఇది మనస్సు, మెదడుపై చీపురు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి.
తుప్పు పట్టిన ఇనుము, ప్లాస్టిక్: వాస్తు శాస్త్రం ప్రకారం మీరు నిద్రించే ప్రదేశంలో తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను ఉంచవద్దు. ఇలా ఉంచటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
ఎలక్ట్రానిక్ వస్తువులు: వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో మంచం కింద ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచకూడదు. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి .
బూట్లు, చెప్పులు: అలాగే నిద్రించే ప్రదేశంలో బూట్లు, చెప్పులు వంటివాటిని కూడా ఉంచవద్దు. వీటి వల్ల ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తొలగిపోయి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
అద్దం, నూనె : అలాగే పొరపాటున కూడా మంచం కింద గాజు లేదా నూనె ఉంచవద్దు. ఎందుకంటే ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ప్రదేశంలో ఉంటే కుటుంబానికి హానికరం. ఇలా ఉంచటం వల్ల కుతుంసభ్యుల మద్య గొడవలు జరుగుతాయి.