వాస్తు శాస్త్రం పట్ల ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. అందువల్ల ఇప్పటికి ఎంతో మంది ప్రజలు వాస్తవ నియమాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాస్తవని హేమాలకు విరుద్ధంగా కొన్ని పనులు చేయటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఆ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. అందువల్ల కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ వస్తువులను ఇంట్లో ఉంచటం వల్ల కీడు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా ఇంట్లో రకరకాల ప్లాస్టిక్, రాజు వస్తువులు పెట్టుకుంటారు. అయితే పొరపాటున అవి కిందపడి విరిగిపోతూ ఉంటాయి. అయినా కూడా కొంతమంది వాటిని అలాగే ఇంట్లో ఉంచుతారు. అయితే, ఎప్పుడైతే ఒక పరిపూర్ణంగా ఉండే వస్తువు కిందపడి పగిలిపోతుందో దాని నుంచి నెగెటివ్ ఎనర్జీ విడుదల అవుతుందటని శాస్త్రం చెబుతోంది. ఇలా పగిలిపోయిన వాటిని అతికించినా కూడా ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిన చెక్క కుర్చీలు, విరిగిపోయిన వస్తువులను వెంటనే ఇంట్లో నుంచి దూరంగా తీసుకువెళ్లాలి. ఇంటికి వెనుక లేదా స్టోరీ రూంలో పెట్టిన పరువాలేదు. కానీ నట్టింట్లో ఉంచి వాటిని వినియోగించరాదు.
విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచి వాడుకోవటం వలన ఆ ఇంట్లో సుఖసంతోషాలు తొలగిపోయి కష్టాల మొదలవుతాయి. అలాగే ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉంచటం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా భార్యాభర్తలు కుటుంబ సభ్యుల మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడవలసి వస్తుంది. అందువల్ల విరిగిపోయిన వస్తువులను పొరపాటున కూడా ఇంట్లో ఉంచరాదు. అలాగే పగిలిపోయిన దేవుడి ఫోటోలను కూడా ఇంట్లో ఉంచడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. దేవుడి ఫోటోలు పగిలిపోయిన వెంటనే వాటిని పారుతున్న నీటిలో వేయాలి… లేదా మంటలలో వేసి కాల్చాలి.