Balakrishna Health : వైరల్ : బాలకృష్ణ ఆరోగ్య వార్తల్లో సినీ వర్గాల నుంచి కీలక స్పష్టత.!

Balakrishna Health :  నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ 107వ సినిమాగా తెరకెక్కుతుంది. అయితే సెట్స్ పై  షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య భుజానికి దెబ్బ తాకింది అని అందుకే తాను కీలక సర్జరీ చేయించుకున్నారని ఓ వార్త పెద్ద ఎత్తున సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
దీనితో ఇది నిజమే అని చాలా మంది నమ్మారు కానీ ఇప్పుడు సినీ వర్గాల నుంచి ఒక కీలక స్పష్టత అయితే వచ్చింది. బాలకృష్ణ కి సర్జరీ జరిగిందన్న మాట నిజం కాదని ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగుతుందని. కాకపోతే బాలయ్య తన రెగ్యులర్ గా చేసుకునే చెకప్ కి వెళ్లారు తప్పితే అందులో ఎలాంటి సర్జరీ లేదని అంతే కాకుండా తాను ఆరోగ్యంగా ఉన్నారని ప్రముఖ సినిమా విశ్లేషకులు తెలియజేసారు.
ఇది మాత్రమేనా ఈరోజు కూడా బాలయ్య తన సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని తెలిసింది. దీనితో బాలయ్యపై వైరల్ గా మారిన ఆ తప్పుడు వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రచారం చెయ్యొద్దని తెలిపుతున్నారు.
ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు.