కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పాటించాల్సిన అతి ముఖ్యమైన ఆహార నియమాలివే?

తరచూ మూత్ర ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్ల సమస్యలు తలెత్తినప్పుడు అశ్రద్ధ వహిస్తే దీర్ఘకాలంలో కిడ్నీ పూర్తిగా పాడై కిడ్నీ మార్చుకోవాల్సి వస్తుంది. కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత క్రమబద్ధమైన ఆహార నియమాలు పాటించకుంటే తీవ్ర ముప్పు తప్పదు అంటున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న వ్యక్తులు కేవలం 20 శాతం మంది మాత్రమే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తి మళ్లీ కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది దీనికి కారణాలను పరిశీలిస్తే సరైన ఆహార ఆహార అలవాట్లు లేకపోవడమే అన్న నిజాలు స్పష్టమవుతున్నాయి.

కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు పాటించాల్సిన ఆహార నియమాలను పరిశీలిస్తే కిడ్నీ మార్పిడి తర్వాత శరీరం పూర్తిగా కోలుకోవడానికి అత్యధిక ప్రోటీన్స్ అవసరమవుతాయి కావున ప్రోటీన్స్ సమృద్ధిగా లభించే పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే డయాలసిస్ స్టేజ్ లో ఉన్న వ్యక్తులు కూడా ప్రోటీన్స్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.ప్రోటీన్ సప్లిమెంట్ల్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. మనలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించే విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ సమృద్ధిగా ఉన్న నారింజ ,బత్తాయి వంటి పండ్లను ఎక్కువగా తినాలి.

కిడ్నీ మార్పిడి తర్వాత టమోటా, బెండకాయ, జామ, పుచ్చకాయ వంటి విత్తనాలు ఉన్న పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఎటువంటి హాని లేదు, ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, ఎలక్ట్రోలైట్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి.అయితే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ గింజలతో ఉన్న పండ్లు, కూరగాయలు తినడం మానుకోవాలి. ద్రాక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఆహారంగా తీసుకోరాదు. కిడ్నీ మార్పిడి తర్వాత పచ్చి పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని చెప్తున్నారు కారణం