ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా రాజకీయాలు థ్రిల్లర్ మూవీస్ కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. థ్రిల్లర్ లో వచ్చే మలుపులు ఊహించవచ్చు కానీ రాజకీయాల్లో వచ్చే మలుపులను అస్సలు ఊహించలేము. ఎందుకంటే కనీసం కథల్లో ఉండే పాత్రలకు కూడా ఒక నీతి, నిజాయితీ ఉంటుంది కాబట్టి అవి చేసే పనులను మనం అంచనా వేయవచ్చు కానీ రాజకీయ నాయకులకు నీతి, నిజాయితీ అనే పదాలు కూడా తెలియవు కాబట్టి వాళ్ళు చేసే పనులను అంచనా వేయడం, ఊహించడం చాలా కష్టం. మొన్నటి వరకు బీజేపీని ఇష్టమొచ్చినట్టు తిట్టిన వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఇప్పుడు బీజేపీ పంచన చేరడానికి సిద్ధమవుతున్నారు.
వైసీపీ ఇజ్జత్ తీసిన బీజేపీ నేత
ఎన్డీయేలో చేరాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధాని నరేంద్రమోడీ అడిగారని, ప్రత్యేక హోదా ఇస్తానే చేరుతానని జగన్ చెప్పాడని వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వరుసగా ప్రసారం అవుతున్న సమయంలో బీజేపీ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్నటువంటి సునీల్ దియోధర్ వైసీపీ ఇజ్జత్ తీసి గంగలో కలిపారు. అవినీతి తో నిండిపోయిన వైఎస్ఆర్సిపి తో తమకు ఎటువంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రయాణం జనసేన పార్టీ తోనే ఉంటుందని చెప్పారు. ఇలా చెప్పడంతో కావాలని తప్పుడు కథనాలు ప్రచారం చేసిన చానెల్స్ యొక్క ఇజ్జత్, అలా చేయించిన వైసీపీ నేతల ఇజ్జత్ గంగలో కలిసింది.
ఈ తప్పుడు ప్రచారం వైసీపీ ఎందుకు చేస్తుంది ?
ఇలాంటి ప్రచారాలు చేసి బీజేపీలో చేరాలనుకుంటున్న టీడీపీని టెన్షన్ పెట్టడం ఒకటైతే, మరో పక్క బీజేపీకి కూడా లేని ఆలోచనలను పట్టించడం. ఇలా బీజేపీకి కూడా లేని ఆలోచనలను పుట్టించి, బీజేపీతో జతకట్టి రాజకీయ ప్రత్యర్థులను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇలా ప్రచారం చేసి, చివరికి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం వల్లే తాము ఎన్డీయే చేరడం లేదని మళ్ళీ తమ అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.