“NTR 30” ఆగిపోలేదు..ఫైనల్ గా ఆ బిగ్ అప్డేట్..!

గత కొన్నాళ్ల నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆసక్తిగా ఓ రకంగా అయితే చాలా అనుమానంగా తన హీరో నటించనున్న ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓ టైం లో అయితే ఏకంగా సినిమా ఆగిపోయింది అనే రూమర్స్ కూడా గట్టిగా స్టార్ట్ కాగా అక్కడ నుంచి వారిలో మరింత టెన్షన్ ఎక్కువయ్యింది.

అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఊరటనిచ్చే బిగ్ అప్డేట్ ని చిత్ర బృందం ఇప్పుడు రివీల్ చేసింది. అసలు సినిమా ఉందా లేదా అనే డౌట్ ని తీరుస్తూ పక్కాగా సినిమా ఆన్ లోనే ఉంది ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టుగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు.

మరి ఇందులో దర్శకుడు కొరటాల శివ అలాగే డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు అలాగే సాబు సిరిల్ లు అయితే కనిపిస్తున్నారు. దీనితో ఈ చిత్రంపై ఫైనల్ గా ఈ బిగ్ అప్డేట్ తో సంచలన క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ఇక అభిమానులు కూడా ఈ మాత్రం క్లారిటీ చాలని ఫీల్ అవుతున్నారు.

ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ వర్క్ చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు భారీ మొత్తం బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.