ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్ గాసిప్స్ పై క్లారిటీ.!

ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో తన లాస్ట్ భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో ప్రపంచ వ్యాప్తంగా భారీ రీచ్ ని తాను సొంతం చేసుకోగా దీని తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు.

అయితే ఇది చరణ్ కెరీర్ లో పీక్ స్టేజి గా మారగా దీని తర్వాత అయితే రామ్ చరణ్ తో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో చేయనున్న తో ఏకంగా ఓ హాలీవుడ్ లెవెల్ ఏక్షన్ ప్రాజెక్ట్ ని అయితే యూవీ క్రియేషన్స్ వారు ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రం సెట్టయి తర్వాత ఆగిపోయినట్టుగా అనేక గాసిప్స్ అయితే బయటకి వచ్చాయి.

మరి ఈ చిత్రం ఉందా లేదా అనే దానిపై ఇప్పుడు మెగా పి ఆర్ టీం నుంచి ఓ బిగ్ క్లారిటీ బయటికి వచ్చింది. చరణ్ పి ఆర్ శివ చెర్రీ రామ్ చరణ్ గౌతమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తూ ఈ సినిమా ఆగిపోయింది అని కన్ఫర్మ్ చేసాడు. అలాగే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అయితే ఎప్ప్పుడు ఉంటుంది..

ఎవరితో ఉంటుంది అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తామని కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అని కన్ఫర్మ్ చేసాడు. ఇప్పుడు అయితే కన్నడ దర్శకునితో చేసే ఛాన్స్ ఉందని పలు గాసిప్స్ ఉన్నాయి. మరి అందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.