Fine: మాస్కులు పెట్టుకోకుండా 58కోట్లు ఫైన్ కట్టారు.. ఆ నగర ప్రజలు

Fine: భారత్ లో సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో మొదట్లో మహారాష్ట్రలోనే రోజుకి వేల కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో దేశంలో మరెక్కడా వైరస్ విజృంభణ లేదు. దీంతో.. అంతా సెకండ్ వేవ్ ను మహారాష్ట్ర ఇష్యూగా చూశారే కానీ.. పెద్దగా ఎవరూ అలెర్ట్ కాలేదు. కానీ.. పరిస్థితి చాపకింద నీరులా దేశం మొత్తాన్ని చుట్టేసంది. మొత్తంగా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది. ఈక్రమంలో హైఅలెర్ట్ తోపాటు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాలకే అధికారాలు కట్టబెట్టింది. ఈక్రమంలో మాస్క్ ధరించకపోతే ఫైన్ కట్టాలనే నిభంధనను కఠినంగా అమలు చేయడంతో దేశంలోని ఓ నగర ప్రజలు ఏకంగా 58కోట్లు ఫైన్ల రూపంలో కట్టారు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే..

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఈక్రమంలో అత్యధిక కేసులు నమోదవుతున్న ముంబైలో కూడా కఠిన చర్యలే తీసుకున్నారు. ఇందులో భాగంగా మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని ప్రకటించింది. నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోని వారిన నుంచి భారీగా జరిమానాలు వసూలు చేశారు. అలా బీఎంసీ పరిధిలో మొత్తంగా రూ.58 కోట్లు జరిమానా రూపంలో ప్రజల నుంచి వసూల్ చేశారు. జూన్ 23వ తేదీ వరకు వసూలైన మొత్తాన్ని బీఎంసీ వెల్డించింది. ఇందులో ముంబై సివిల్ పోలీసులు, రైల్వే పోలీసులు ఈ జరిమానాలు వసూలు చేశారు.

ఈ విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సెకండ్ వేవ్ మొదట్లోనే మాస్కులు పెట్టుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. అందువల్లే పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిందని చెప్పాలి. అయితే.. ముంబై వాసులు మాస్కులు పెట్టుకోక ఇలా కోట్ల రూపంలో బీఎంసీకి చెల్లించుకోవడం మాత్రం విడ్డూరమే. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ సమయంలో ప్రతిరోజూ 60-70 వేల వరకూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 51,667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1329 మంది ప్రాణాలు కోల్పోయారు. 64,527 మంది కోలుకున్నారు.