ఎన్నికల నగారా మోగింది.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల !

electoral body losing confidence

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

గత ఏడాది కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఛాలెంజింగ్ అని సునీల్ అరోరా అన్నారు. కరోనా సమయంలో కూడా సేవలు అందించిన అధికారులను ఆయన అభినందించారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 18.68 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వారికి 2.7 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 1000 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అది కూడా పోలింగ్ బూత్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటాయన్నారు. 80 ఏళ్ల పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈసారి ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

అసోంలో మూడు దశల్లో ఎన్నికలు ఉంటాయి.

మొదటి దశ ఎన్నికలు మార్చి 27
రెండో దశ పోలింగ్ మార్చి ఏప్రిల్ 1
మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6

కేరళలో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ – ఏప్రిల్ 6

తమిళనాడులో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ – ఏప్రిల్ 6

పుదుచ్చేరిలో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ – ఏప్రిల్ 6

పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు

మొదటి దశ ఎన్నికలు – మార్చి 27
రెండో దశ ఎన్నికలు – ఏప్రిల్ 1
మూడో దశ ఎన్నికలు – ఏప్రిల్ 6
నాలుగో దశ ఎన్నికలు – ఏప్రిల్ 10
ఐదో దశ ఎన్నికలు – ఏప్రిల్ 17
ఆరో దశ ఎన్నికలు – ఏప్రిల్ 22
ఏడో విడత .. ఎన్నికల తేదీ: ఏప్రిల్ 26

8వ విడత.. ఎన్నికల తేదీ: ఏప్రిల్ 29

అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ – మే 2న