K.A Paul: కాంగ్రెస్ విజయానికి 4 వేల కోట్లు ఖర్చు… రేవంత్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు?

K.A Paul: ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియా ముందు మాట్లాడే వ్యాఖ్యలను చాలామంది సిల్లీగా తీసుకుంటూ ఉంటారు ఆయన వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ ఉంటారు కానీ ఆయన ఏం మాట్లాడినా ఎంతో లాజిక్ ఉండి మాట్లాడతారు. కరెక్ట్ పాయింట్ పైన ఆయన ప్రభుత్వాలని నిలదీస్తూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలోని తన పార్టీ ఆఫీసులో ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కావడానికి సుమారు 4000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు అంత డబ్బు ఎక్కడిది ఈ విషయంపై విచారణ జరపాలని త్వరలోనే అన్ని సాక్షాధారాలను కూడా బయట పెడతాను అంటూ కే ఏ పాల్ తెలియజేశారు. ఇక మేఘా సమస్థ అధినేత కృష్ణారెడ్డి గురించి కూడా మాట్లాడుతూ ఈయన కాంగ్రెస్ పార్టీకి బాండ్ల రూపంలో లెక్కలేని బ్లాక్ మనీ ఇస్తున్నాడని ఆరోపించారు.

ఇక రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మేఘ కృష్ణారెడ్డిని ఇష్టానుసారంగా తిట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిరోజు మేఘ కంపెనీ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్ని కూడా మేఘ వారికే ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక మేఘ వారికి 15 వేల కోట్ల ప్రాజెక్టులను ఎందుకు ఇచ్చారు అంటూ రేవంత్ రెడ్డిని కేఏ పాల్ ప్రశ్నించారు. ఇలా కేఏపాల్ రేవంత్ రెడ్డి గురించి అలాగే మేఘ కృష్ణారెడ్డి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.