Revanth Reddy: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు అంటూ సంచలనమైన ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుత వైరల్ అవుతుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో అధికారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సరిగా తెలంగాణలో ఎన్నికలు జరిగి నేటికీ ఏడాది అయిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి మార్పు కోసం ఓటేశాడు. ఆ ఓటే నేడు అభయ హస్తమై రైతన్న చరిత్రను తిరగ రాసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతోపాటు.. రూ.7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్, రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్, రూ.1433 కోట్ల రైతుబీమా, రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం, రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేయడం జరిగిందని రేవంత్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదిలోనే ఏకంగా 54 వేలకోట్ల రూపాయలతో రైతుల జీవితాలలో పండుగ తీసుకొచ్చామని తెలిపారు అది కేవలం నెంబర్ మాత్రమే కాదు రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక 2023 నవంబర్ 30వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగక డిసెంబర్ మూడో తేదీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.