దారుణం: టోల్ ప్లాజా ను ఢీ కొట్టిన అంబులెన్స్.. నలుగురు మృతి?

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన అనారోగ్యానికి గురైన ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్ ఏకంగా ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది.అంబులెన్స్ లో ప్రయాణం చేస్తున్న రోగితో సహా మరో ముగ్గురు మృతి చెందిన ఘటన అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది ప్రమాదానికి గల కారణమేమిటి అనే విషయానికి వస్తే..

కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవర ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జోరుగా వర్షం కూడా పడటంతో అంబులెన్స్ చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. అయితే మార్గమధ్యంలో ఉన్నటువంటి బైందూరు సమీపంలోని టోల్‌ ప్లాజా సిబ్బంది అంబులెన్స్‌ను గమనించి ఆంబులెన్స్ కు టోల్ ప్లాజా దగ్గర ప్రత్యేకమైన మార్గం సిద్ధం చేయడం కోసం టోల్ ప్లాజా ముందు ఏర్పాటు చేసిన భారీకేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజా సిబ్బంది ఈ భారీకేర్లను తొలగించినప్పటికీ పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంది.

ఒకవైపు పెద్దగా వర్షం పడటమే కాకుండా మరోవైపు అంబులెన్స్ చాలా వేగంగా రావడంతో టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక లైన్లో అంబులెన్స్ వెళ్లడానికి ప్రయత్నించి అదుపుతప్పింది. వర్షం కారణంగా రోడ్డుపై వాహనం టైర్లు జారడంతో ఒక్కసారిగా అంబులెన్స్ యూటర్న్ తీసుకొని టోల్ ప్లాజా క్యాబిన్ వైపుకు దూసుకు వెళ్లింది.అంబులెన్స్ వేగంగా రావటం వల్ల ఒక్కసారిగా అంబులెన్స్ లో ఉన్నటువంటి రోగితో పాటు ఇద్దరు సహాయక సిబ్బంది రోడ్డు బయటకు ఎగిరీ పడి మృతి చెందారు.అదేవిధంగా టోల్ ప్లాజా క్యాబిన్లో ఉన్నటువంటి మరో సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ అంబులెన్స్ కు చెందిన ఈ ఘటన అక్కడే ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో చూస్తే నిజంగానే ఒళ్ళు జలదరించెలా ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.