Black Fungus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి అల్లకల్లోలం సృష్టించిందో తెలిసిందే. దాంతోపాటే బ్లాక్ ఫంగస్ కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చిన్నారులకు కరోనా వైరస్ ముప్పు తక్కువే అయినా.. బ్లాక్ ఫంగస్ మాత్రం వారిపై ప్రతాపం చూపిస్తోంది. ఈక్రమంలో ముంబైలో ముగ్గరు చిన్నారులకు బ్లాక్ ఫంగస్ ద్వారా జరిగిన నష్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. 4,6,14 ఏళ్ల పిల్లలు బ్లాక్ ఫంగస్ బారిన పడటంతో ఏకంగా వారి కళ్లు తొలగించాల్సి వచ్చింది. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి మరీ వారి కన్ను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే..
ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక కరోనా నుంచి కోలుకుని డయాబెటిస్ బారిన పడింది. అనంతరం కంట్లో సమస్యగా అనిపించి ఆస్పత్రికి వెళ్లింది. కేవలం 48 గంటల్లోనే ఆమె కన్ను నల్లగా మారిపోయింది. దీంతో ఆమె బ్లాక్ ఫంగస్ కు గురైందని గుర్తించారు వైద్యులు. ఆరు వారాలపాటు వైద్యం అందించారు. కానీ.. ఆమె ముక్కు వరకు ఫంగస్ సోకడంతో పరిస్థితి విషమించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాలిక కళ్లు తొలగించారు. మెదడు వరకూ ఫంగస్ సోకికపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అంతకుముందు బాలికకు డయాబెటిస్ లేదు.
మిగిలిన ఇద్దరు చిన్నారులకు కోవిడ్ బారినపడ్డారు. వారికి డయాబెటిస్ సమస్య లేదు. కానీ.. చిన్నారులిద్దరూ బ్లాక్ ఫంగస్ సోకింది. గతంలోనే వీరిద్దరికీ ఒక కన్సు సమస్య ఉంది. రెండో కంటికి ఫంగస్ సోకడంతో వీరిద్దరినీ ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్ ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేర్చారు. వీరి పరిస్థితి తీవ్రం కావడంతో చికిత్స ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆపరేషన్ చేసి వీరికి కన్ను తొలగించారు. కన్ను తొలగించకపోతే జీవితాంతం వారు ప్రమాదమేనని వైద్యులు చెప్తున్నారు.
ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసారు. దేశంలో బ్లాక్ ఫంగస్ సృష్టిస్తున్న విలయానికి ఈ సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోరోనా పిల్లలకు వ్యాపించకుండా జగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ.. బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయితే.. చాలా ప్రమాదమని డాక్టర్లు అంటున్నారు. చిన్నారులకు ఏమాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.