ఆ ప్రేమికుల పెళ్లికి కుటుంబం అంగీకరించింది.. కానీ దేవుడు ఓర్వలేదు.. చెప్పలేని విషాదం!

కర్ణాటక లోని ఒక ఇద్దరు యువతీ యువకులు బంధువులే కావడంతో ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి కూడా ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అయితే తల్లిదండ్రుల ఒప్పుకోవడంతో ఆ ప్రేమికులు ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంతో ఇరు కుటుంబాల సభ్యులు ఉండగా ఒక్కసారిగా ఆ రెండు కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్లు కాబోయేవాడు ఇకలేడని తెలిసి ఆ యువతి కూడా మనస్థాపానికి గురి అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని కలబుర్గిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలబుర్గిలోని పిడబ్ల్యుడి క్వార్టర్స్ కు చెందిన శృతి తన సమీప బంధువు అయిన బసవనబాగేవాడికి చెందిన హనుమంత అనే యువకుడిని ప్రేమించింది. అందరూ బంధువులే కావడంతో ఇరు కుటుంబాల ఇద్దరు కూడా ఆ పిల్లల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. గత నెలలో హనుమంతు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

కాబోయే వాడు మరణించాడు అన్న వార్త తెలుసుకున్న శృతి అప్పటినుంచి మనస్థాపానికి గురి అయింది. తనని ఒక్క దాన్ని విడిచి వెళ్లిపోయారుని కలత చెందిన ఆమె తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఆమె విగతజీవిగా కనపడేసరికి గుండెలవిసేలా రోదించారు. వరుడు బతికి ఉంటే మరికొన్ని రోజులలో ఇరు కుటుంబాలలో బాజాలు మోగాల్సింది పోయి రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన చుట్టుపక్కల వారిని కూడా తీవ్రంగా కలచివేసింది.