108 Ambulance Accident: ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ యాక్సిడెంట్ వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. ఆక్సిడెంట్ల కారణంగా ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోతున్నారు. తాజాగా ప్రాణాలను కాపాడటానికి తీసుకెళ్లే 108 అంబులెన్స్ కి యాక్సిడెంట్ జరిగింది.సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని శివంపేట్ గ్రామంలో తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే..జోగిపేట్ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రెగ్నెన్సీ మహిళను 108 అంబులెన్స్ లో ఎక్కించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గంమధ్యలో 108 అంబులెన్స్ యాక్సిడెంట్ జరిగింది. అంబులెన్స్ అదుపుతప్పి చెరువులు తీసుకు వెళ్తున్న ఎడ్లబండిని ఢీకొట్టింది. అంబులెన్స్ ఢీకొట్టడంతో ఒక ఎద్దు గాయపడింది. ఈ ఘటన వల్ల అంబులెన్స్ లో ఉన్న మహిళలకు కాలు విరిగింది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి మరొక 108 అంబులెన్స్ కి సమాచారం అందించగా క్షణాలలో ఆ పేషెంట్ ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాణాలు కాపాడటానికి తీసుకువెళ్లే అంబులెన్స్ వల్లే ప్రమాదం జరిగితే ప్రజలు వేటిని ఆశ్రయించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రజలు అంబులెన్స్ ఆశ్రయిస్తే కానీ వాటి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. అంబులెన్స్ డ్రైవర్లు వెనక ముందు చూడకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.