టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఆయనకు 100 కోట్ల జరిమానా పడింది. ఆయనకు 100 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు ఏపీ మైనింగ్ అధికారులు వెల్లడించారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న దానిపై ఆయనకు ఈ జరిమానా విధించారు.
త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ అక్రమాలకు పాల్పడ్డారని మైనింగ్ అధికారులు గుర్తించారు. దీంతో ఆయనకు 100 కోట్ల జరిమానా విధించారు. ఒకవేళ ఆయన ఈ జరిమానా కట్టకపోతే.. ఆర్అండ్ఆర్ చట్టం కింద తన ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీని తన ఇంట్లో పనిచేసే వాళ్లు, డ్రైవర్ల పేరు మీద జేసీ నెలకొల్పారు. దాని అనుమతులు వచ్చాక.. వాళ్ల పేర్ల మీది నుంచి తన కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ఫ్యాక్టరీని బదలాయించినట్టు జేసీపై ఆరోపణలు ఉన్నాయి.
అనంతపురం జిల్లాలోని యాడి మండలంలో ఉన్న కోన ఉప్పలపాడులో అక్రమంగా తవ్వకాలు జరిపి… ఎంతో విలువైన లైమ్ స్టోన్ ను వెలికి తీసి విక్రయించారని.. సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ ను విక్రయించినట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే జేసీకే చెందిన జేసీ ట్రావెల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా జేసీకి చెందిన మరో అవినీతి బయటపడింది. దీనిపై జేసీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.