లాక్ డౌన్ తో గత రెండున్నర నెలలుగా అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో సెలబ్రిటీలు సహా రాజకీయ నాయకులుకు కావాల్సినంత సమయం దొరికింది. ఇంట్లో ఉంటూ కుటుంబంతో ఎక్కువ సమాయాన్ని గడిపారు. ఇక సెలబ్రిటీలు…ఒళ్లు చేసిన వారంతా జిమ్ముకి ఎక్కువ సమయం కేటాయించారు. బరువు తగ్గించుకోవడానికి లాక్ డౌన్ ని బాగా వాడుకున్నారు. సరైన డైట్ ఫుడ్ తీసుకుంటూ…టైమ్ టు టైమ్ కసరత్తులు చేసి బరవు తగ్గించి సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఆజాబితాలో తేదాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా నాలోకేష్ బాబు కూడా ఉన్నారన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలుగు దేశం పార్టీ జెండా పండుగ మహానాడు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వేడుకలో చినబాబు సెంట్రాఫ్ ది అట్రాక్షన్ అయ్యారు. లోకేష్ ని అరవై రోజుల తర్వాత తమ పార్టీ నేతలు చూసి షాక్ అయ్యారు. సాధారణంగా బొద్దుగా ఉండే చినబాబు నిన్న స్లిమ్ లుక్ కనిపించి షాకిచ్చారు. ఉబ్బెత్తున ఉండే పొట్ట బాగా తగ్గడం…ముఖంలో మార్పులు…కళ్లు లోపలికి పీక్కుపోయినట్లు ఉండటం చూసి అసలు చినబాబేనా అని చాలా మంది షాక్ అయ్యారుట. ఆ తర్వాత నెమ్మదిగా అసలు విషయాన్ని లోకేష్ రివీల్ చేసారు. కరోనాతో లాక్ డౌన్ కదా? చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను.
దీంతో బరువు తగ్గించడం దృష్టి పెట్టానని తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యం కూడా ఎంతో హాయిగా ఉందని…నిత్యం కసరత్తులు చేస్తే ఎంతో మేలు అని కార్యకర్తలకు సూచించారు.జిమ్ములో కసరత్తులతో పాటు తక్కువ ఆహారం తీసుకుని 60 రోజుల్లోనే 20 కేజీలు బరువు తగ్గానని తెలిపారు. అలాగే పొలిటికల్ కెరీర్ గురించి కూడా ప్రస్తావించారు. సంక్షోభాన్ని అవకాశాలు గా మలుచుకుని ప్రజా సంక్షేమానికి తన తండ్రి చంద్రబాబు ఏ విధంగా పనిచేస్తున్నారో? అదే విధం గా పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు షరా మూములుగా అధికార పక్షంపై తనదైన శైలిలో విమర్శలు చేసారు.