షాకింగ్ : హీరో నితిన్ భార్యకి కరోనా! తన పోస్ట్ చూస్తే ఎమోషన్ అవ్వాల్సిం

ప్రపంచంలో ఆల్రెడీ కరోనా మూడో వేవ్ ఆల్రెడీ ఎంటర్ అయ్యిపోయింది. దీనితో మన దేశం సహా అన్ని దేశాల్లో ఒక్కసారిగా భారీ స్థాయిలో కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. అలానే మన దేశంలో ఈ కొత్త సంవత్సరంకి ఎంటర్ అయ్యే సరికి ఈరోజుకి భారీ మార్పు వచ్చేసింది. అయితే ఇదిలా ఉండగా ఈ మూడో వేవ్ లో అనేక మంది సినీ తారలే కరోనా బారిన పడుతుండడం గమనార్హం.

గత కొన్ని రోజులు కితమే యంగ్ హీరోలు విశ్వక్ సేన్, మంచు మనోజ్ లు కరోనా పాజిటివ్ గా తేలగా నిన్ననే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్రెడీ వాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన పడ్డాడు. దీనితో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఈ తర్వాత కొంత వ్యవధిలో టాలీవుడ్ టైర్ 2లో టాప్ హీరో అయినటువంటి నితిన్ తన భార్యకి కరోనా ఉన్నట్టు తెలిపాడు.

అయితే అధికారికంగా అనౌన్స్ చేస్తున్నట్టు కాకుండా ఆల్రెడీ కరోనా ఉన్న తన భార్యకి బర్త్ డే విషెష్ తెలుపుతూ పోస్ట్ చేసాడు. మరి ఈ పోస్ట్ చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే అని చెప్పాలి. “కరోనా కి అడ్డంకులు ఉన్నా ప్రేమకు మాత్రం ఎలాంటి అడ్డంకులూ ఉండవు.

హ్యాపీ బర్త్ డే మై లవ్, లైఫ్ లో మొదటి సారి నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నాని” తన భార్య ఓ అపార్ట్మెంట్ లో సింగిల్ గా ఒక రూమ్ లో కిటికీ నుంచి చూస్తుండగా నితిన్ కింద నుంచి కేక్ ని కట్ చేసి తన భార్య పుట్టినరోజుని జరిపాడు. దీనితో ఇది చూసిన వారు అంతా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.