కేసీఆర్.. కరోనా పరీక్షలు ఎక్కడా ?

 
కరోనా మహమ్మారి విజృంభన ఇంకా ఆగలేదు.  ప్రభుత్వాలు మాత్రం మరిన్ని సడలింపులతో ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో కూడా ! ఇప్పటికీ  తెలంగాణలో కేసులు వస్తూనే ఉన్నాయి. నిజానికి తెలంగాణలో తక్కువగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్యను తక్కువగా చూపడానికే టెస్టులు తక్కువగా చేస్తున్నారా ?  ప్రమాదకరమైన వైఖరితో ప్రజలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందా ?  అయినా  ‘మరో రెండు వారాల్లో రోజుకు 5 వేల కరోనా టెస్టులు చేస్తామంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఏప్రిల్‌ చివరిలో చెప్పారు. అది ఏమైంది ?  ఎందుకు కరోనా పరీక్షలు ఎక్కువగా జరగట్లేదు ? 


 
అయితే  తాజాగా  కొందరు డాక్టర్లు కొత్త ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారినీ ఇతర కారణాల వల్లనే మరణించినట్లుగా చూపుతున్నారట. దేనికి ?  ఒక పక్క  ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు చెయ్యరు ? ఇప్పటివరకూ  తెలంగాణలో కేవలం 24వేల మందికి  మాత్రమే  పరీక్షలు చేశారని లెక్కలు చెబుతున్నాయి. మరి వీటికి కేసీఆర్ ప్రభుత్వం ఏం చెబుతుంది ?  హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం రాలేదు అంటే కేసీఆర్ కూడా కోర్టులను పట్టించుకోవడం మానేశారు అనుకోవాల్సి వస్తోంది.
 
వాస్తవాలు బయటికి రావద్దనే విధంగా  కేసీఆర్‌ ధోరణి ఉందా ? ఇది సరైందని కేసీఆర్ ఎందుకు భావిస్తున్నారో ఆయనకే తెలియాలి.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  పరీక్షల క్రమాన్ని పెంచితే  ప్రజలకు మేలు చేసినవారవుతారు. మరి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.