కేసీఆర్ ఇకిలింపు ఆపి   ఆకళింపు చేసుకో !     

 
ఎదురు లేకుండా వెలిగిపోతోన్న  కేసీఆర్ కు  కరోనా రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. జనంలో  కేసీఆర్ మీదే వ్యక్తిరేకత మొదలైంది.  ఇక  కేసీఆర్ గొప్పలకి  కాలం చెల్లిపోయింది. తనది రైతు రాజ్యమని కేసీఆర్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటాడు.  ఇన్నాళ్లు ‘తెలంగాణలో ఏ రైతైనా రోడ్డెక్కుతడా.. దేశంలోనే రైతులకు అన్ని సమకూర్చిన రాజ్యం తెలంగాణ’ అని తనకు తానే డబ్బా కొట్టుకుంటూ  ముందుకుపోతున్నాడు.  అయితే కేసీఆర్ ఎంత ధీమాగా చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదనేది వాస్తవం.  పంటనష్టం, అప్పుల బాధతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని  కేసీఆర్ కి తెలియంది కాదు.
 
తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 85మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక సంచలన నివేదికను వెల్లడించిందని  కేసీఆర్ కి రిపోర్ట్స్ వెళ్లకుండా ఉంటాయా  ? పంట నష్టం, అప్పుల భారంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆ నివేదిక తెలిపింది. ఎక్కువుగా   ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధిక రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంతేకాదు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి తెలంగాణలో దాదాపు ఈ ఆరేళ్లలో 4600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ సర్వే తెలిపింది.
 
వారిలో పత్తి రైతులే ఎక్కువమంది ఉన్నారు. ఇలా తెలంగాణలో ప్రతి జిల్లాల్లోనూ ఆత్మహత్యలు జరిగినట్టు ఈ నివేదిక సంచలనం రేపుతోంది. కేసీఆర్ మాత్రం తెలంగాణను రైతు రాజ్యంగా  అభివర్ణించి చాలా వసతులు పథకాలు పెట్టామని బీరాలు పలుకుతూ..  చివర్లో ఒక ఇకిలింపు ఇకిలించి మళ్ళీ చక్కగా  తన ఫామ్ హౌస్ కు పోతున్నాడు. ఇకనైనా కేసీఆర్  ఇకిలింపులు ఆపి వాస్తవాలను ఆకళింపు చేసుకోవాలి.