ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అనుకూల మీడియా నిత్యం వికృత రాతలు రాస్తూనే ఉంటుంది. అయితే ఈసారి జగన్ సర్కార్‌ను ఇరకాటంలో పెడదామని, తాజాగా రాసిన ఓ కథనం, చంద్రబాబును ఇరికించేలా చేసిందని రాజకీయవర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎల్లో మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.. అందరూ ఊహించన విధంగానే, జగన్ ప్రభుత్వం బీసీ వర్గానికి చెందిన వారిని పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా బీసీ-ఏ సబ్ కేటగిరీలో చాలా సామాజిక వర్గాలు నేటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదని, వారివైపు జగన్ సర్కార్ కన్నెత్తి చూడడం లేదని, సంచార జాతులకు విముక్తి ఏదీ అంటూ ఓ కథనం రాసుకొచ్చింది.
ఇక ఆ కథనం పై కొంచెం లోతుగా వెళితే.. ఏడాదికో చోట సంచార జీవనం గడుపుతూ ఉండే దాదాపు 32 కులాలకు చెందిన జనాలకు, ఇప్పటికీ రేషన్‌కార్డులు లేవని, అలాగే ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటివి కూడా వారికి లేకపోవడం వలన ఎలాంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదని.. ఈ క్రమంలో జగన్ సర్కార్ ఇచ్చిన నవరత్నాలకు సంబంధించిన పథకాల్లో, ఆయా కూలాలకు చెందిన జనాలు లబ్ధిదారులు కాలేకపోయారని ఎల్లో మీడియా కథన రాసింది.
అయితే ఈసారి జగన్‌ను డిఫెన్స్‌లో పడేద్దామనుకున్న ఎల్లో మీడియా పప్పులు ఉడకలేదు. పైగా రివర్స్‌లో చంద్రబాబు పైనే విమర్శలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు, ఐదేళ్ళ పాటు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం, ఈ కథనం రాసే సమయంలో, ఆ ఎల్లో మీడియా బుర్రలోకి రాలేదేమో.. నిజానికి బీసీలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆయన గానీ, టీడీపీ నేతలు కానీ, బీసీలను ఎందుకు పట్టించుకోలేదు.. ఇప్పుడు గోల చేస్తున్నట్లు, వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎందుకు ఇవ్వలేక పోయారు.. బీసీలే ప్రాణమణి చెప్పుకునే చంద్రబాబు వారికి, ఆయా కులాల వారికి ఏదైనా మంచి చెస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు.. అప్పుడు ఏమయ్యాయి ఈ ఎల్లో మీడియలో రాతలు, అంటూ చంద్రబాబు అండ్ పచ్చ మీడియా పై రివర్స్‌లో విమర్శలు ఎక్కుపెట్టారు. ఏది ఏమైనా టీడీపీ అనుకూల మీడియా అత్యుత్సాహంతో ఈసారి చంద్రబాబు కొంప ముంచిందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.