ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్ధిక పరిస్థితిని…అత్యయిక స్థితిని వివరించి ఎలాగైనా నిధులు తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నాలేవో? ఆయన చేసారు. ఉన్న డబ్బంతా సంక్షేమ ఫలాలు…కరోనా ఖర్చులు అంటూ చేసి! ఇప్పుడు పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడ్డామని బుగ్గన బుజ్జగించే ప్రయత్నం చేసారు. మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? అన్నది తర్వాత. తాజాగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేడు నిర్మలా సీతారామన్ ని కలిసారు. టీటీడీలో ఉన్న 50 కోట్ల పాత కరెన్సీ నోట్లను తీసుకుని కొత్త కరెన్సీ నోట్లు ఇస్తే పాలనకు ఉంతో ఉపయోగపడుతుందని చెప్పే ప్రయత్నం చేసారు.
వాస్తవానికి పాత నోట్లు మార్చుకోమని కేంద్రం అప్పట్లో కొంత సమయం ఇచ్చింది. కానీ భక్తులు చెల్లని నోట్లను స్వామి వారికి చెల్లించుకుని..ఆయన్నే మార్చుకోమన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన గడువు కూడా ముగియడంతో ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో టీటీడీ పాత నోట్లు తీసుకోవాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. కానీ అప్పుడు రిజర్వ్ బ్యాంక్ పట్టించుకో కనో..ప్రభుత్వం అశ్రద్ద చూపించడంమో! తెలియదు గానీ అప్పటి నుంచి ఆ 50 కోట్ల పాతనోట్లు అలాగే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వానికి మార్చుకోవాల్సినంత అవసరం కూడా పడకపోవడంతో పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇప్పటికే అప్పులు..ఇవి చాలవని కరనా పేరుతోనూ బయటకి చెప్పుకోలే అప్పులు చేయాల్సిన పరిస్థితులు. అందుకే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నోట్ల మార్పిడి కోసం రంగంలోకి దిగారు. అయితే మంత్రి బుగ్గన కలిసిన మరుసటి రోజునే సుబ్బారెడ్డి కలవడంపై కొంత ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. బుగ్గన, సుబ్బారెడ్డి ఇరువురు ముందే నిర్ణయించుకుని ఇలా ఒకరి తర్వాత ఒకరు కలిసినట్లు తెలుస్తోంది. నేనెళ్లి ప్రపోజల్ పెడతాను..మీరెళ్లి పాతనోట్లు! అనండి ఇద్దరి పనైపోతుంది. సరే! కారణాలు ఏవైనా పనైతే చాలు. ఇక ఈ వ్యవహరమంతా నిర్మలమ్మ చేతిల్లోనే ఉంది. పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇవ్వాలా? లేక కొత్త గా నిధులు రిలీజ్ చేయాలా? అన్నది మెయిన్ స్విచ్ లోనే ఉంది.