ధ‌ర్మాన‌ని సీఎం జ‌గ‌న్ అలా లాక్ చేయ‌బోతున్నారా?

లోక్ స‌భ స్థానాల ఆధారంగా ఏపీలో కొత్త‌గా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు ముమ్మరం చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 13 జిల్లాలు గా ఉన్న ఏపీని లోక్ స‌భ‌ స్థానాల‌ను బ‌ట్టి 25 జిల్లాలుగా మార‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో 12 జిల్లాల‌ను ఎలాగైనా విభ‌జించుకోండి…మీ ఇష్టం..కానీ మా జిల్లా శ్రీకాకుళం జోలికి మాత్రం రావొద్దంటూ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కాస్త గ‌ట్టిగానే ప్ర‌భుత్వానికి అర్ధ‌మ‌య్యేలాగే చెప్పారు. శ్రీకాకుళంను విభ‌జిస్తే రాజ‌కీయంగా దెబ్బ‌తింటామ ని..అది వైకాపా భ‌విష్య‌త్ కు ఎంత మాత్రం మంచిది కాద‌ని హెచ్చ‌రించారు. అభివృద్ది చెందిన శ్రీకాకుళం జిల్లా ప్రాంతాలు విజ‌య‌న‌గ‌రంలో క‌లిసి పోతే మ‌న‌కే న‌ష్ట‌మ‌ని ధ‌ర్మాన పేర్కోన్నారు.

ఇలా సొంత పార్టీ నేత ఓపెన్ అవ్వ‌డంతో పార్టీలో మిగ‌తా నేత‌లు ఈ విష‌యంపై అసంతృప్తిని వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేసారు. ధ‌ర్మాన లా బ‌య‌ట‌కు చెప్పుకోలేక ఒక‌రి చెవుల్లో మ‌రొక‌రు ఊదుకున్నారు. రాయ‌ల‌సీమ స‌హా ద‌క్షిణ కోస్తాలో కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు వైకాపాకు ఎంత మాత్రం మంచిది కాద‌ని అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఈ అంశాల‌న్నింటిపై బుధ‌వారం జ‌రిగే మంత్రివ‌ర్గ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ అంద‌రితో చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ధ‌ర్మాన‌ని జ‌గ‌న్ మ‌ళ్లీ జిల్లాల ఏర్పాటుపై మాట్లాడ‌కుండా కూల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో మొత్తం వ్య‌వ‌హారం ధ‌ర్మాన‌కే అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారుట‌.

అవ‌స‌ర‌మైతే ఉత్త‌రాంధ్ర జిల్లాల మొత్తం వ్య‌వ‌ర‌హారాన్ని ఆయ‌న‌కే అప్ప‌జెప్పి అన్ని వ్య‌వ‌హారాలు ఆయ‌న్నే చూసుకుమ‌నేలా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. ధ‌ర్మాన‌కి అవ‌స‌ర‌మైన టీమ్ ను కూడా జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్నార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి లీకైంది. ధ‌ర్మాన‌ని అదిష్టానం లైట్ తీసుకోవ‌డానికి ఎంత మాత్రం వీలు లేదు. శ్రీకాకుళంలో జిల్లా ప‌ట్టున్న ఏకైక నాయ‌కుడు. అక్క‌డ రాజ‌కీయాల్ని శాషించే స‌త్తా ఉన్న నాయ‌కుడు. విజ‌య‌న‌గ‌రం జిల్లా లో సైతం ధ‌ర్మాన‌కు మంచి బ‌లం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని లైట్ తీసుకోవ‌డానికి ఎంత మాత్రం స్కోప్ లేదు. పైగా రాజ‌కీయంగా బాగా సీనియ‌ర్ నేత‌. అందుకే జ‌గ‌న్ ఇలా ధ‌ర్మాన‌ని లాక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.