AP: ధర్మానా మౌనానికి అదే కారణమా… ఈయన కూడా సైకిల్ ఎక్కబోతున్నారా?

AP: ఆంధ్రప్రదేశ్ లో వైకాపా పార్టీ ఓడిపోవడంతో ఎంతో మంది కీలక నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి జనసేన పార్టీ లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరుకు చెందిన ప్రముఖ వైకాపా నేత ఆళ్ల నాని త్వరలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు అంటూ ఒక వార్త సంచలనంగా మారింది.

ఈయన ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపారని ఇక ఏ క్షణమైన ఈయన సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వైకాపా పార్టీలో సీనియర్ నేతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ధర్మాన ప్రసాద్ ఒకరు. ఈయన పార్టీ పరంగా ఎంతో అనుభవం ఉన్న నాయకుడు.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈయన రాజకీయాలకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇటీవల వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈయనకు శ్రీకాకుళం ఇన్చార్జి బాధ్యతలను అప్పజెప్పిన ఈయన తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. దీంతో ఈయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ పలువురు వైకాపా నాయకులను కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈయన పార్టీ మారడం గురించి ఎలాంటి విషయాలను కూడా బయటకు పెట్టలేదు అలాగే ఈ విషయం గురించి వస్తున్న వార్తలను కూడా ఖండించలేదు. ఇలా పార్టీకి సంబంధించిన విషయాలు గురించి కనుక మాట్లాడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈయనకు సంబంధించి విశాఖలో భూములు, గనులకు సంబంధించిన కేసులు బయటకు వస్తాయి ఒకవేళ యాక్టివ్గా లేకపోతే ప్రజలకు దూరం కావాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితులలో ధర్మానముందు రెండే రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు మౌనంగా ఉండటం లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి రాజకీయాలలో తిరిగి యాక్టివ్ గా ఉండటం మాత్రమే ఈయన ముందు కనిపిస్తున్న దారులు మరి ధర్మాన ఏ దారిని ఎంచుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.