దేశంలో వలస కార్మికుల మరణ మృదంగం కొనసాగుతోంది. జాతీయ రహదారులుపై యాక్సిడెంట్లు…రైలు మార్గాల్లో ప్రమాదాలతో వలస కూలీల బతుకులు చిద్రమైపోతున్నాయి. గత వారం రోజులుగా ఈ మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఈ ఒక్కరోజే 23 మంది కార్మికులు చనిపోయారు. పని ఇచ్చిన యజమాని ఇప్పుడు తిండి పెట్టలేం…పొమ్మని తరిమేస్తే ఆ బాధత్య ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్? మాకెలాంటి సంబంధం లేదని చెతులెత్తేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అదే చేసింది. వలస కార్మికుల బాధ్యత మాకు సంబంధం లేదు…రాష్ట్రాలే చూసుకోవాలి.. అంటూ చేతులెత్తేసింది.
రోడ్ల వెంబడి నడవకుండా..రైలు పట్టాల వెంబడి వెళ్లకుండా..తిండి..నిద్ర లేకపోతే ఆ ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా సెలవిచ్చారు. తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటోన్న కార్మికుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా సొంత ప్రాంతాలకు పంపిచే బాధ్యత రాష్ట్రాలే తీసుకోవాలని తెలిపారు. వలస కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతుందని..కావాలంటే వాటి సంఖ్య ఇంకా పెంచుతాం తప్ప మిగతా ఏ బాధ్యత మాపై లేదని కేంద్రం చెప్పకనే చెప్పింది.
వలసలు ఆపడం కానీ, వాటిని పర్య వేక్షించడంగానీ తమ వల్ల కానీ పని అని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే అజయ్ భల్లా రాష్ర్టాలకు పైన చెప్పిన విధంగా లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయ ని తెలిసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన రావడం శోచనీయం.