ఏపీలో మరో రాజకీయ తుఫాన్ పొంచి ఉంది. గన్నవరంలో కేంద్రీ కృతమై పసుపు తీరం వైపు కదులుతోంది అన్నది అమరావతి కేంద్రం హాగానాల టాక్. ఎమ్మెల్యే వల్లభనేని రాజీనామా చేయబోతున్నారా? మళ్లీ పోటీకి ఉప ఎన్నిక చిటిక వేస్తున్నారా? ఆయన సీటి కొడితే సినిమా కనిపించబోయేది ఎవరికి? ఎలా? అన్నది ఇప్పుడు గన్నవరం లో హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం నియోజక వర్గం టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ రాజీనామాకు సిద్దమయ్యేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ నిర్ణయానికి అవకాశం ఉన్నా…జగమెరిగిన సత్యం ఏంటన్నది తెలిసిందే. 2019 ఎన్నికల్లో రాష్ర్టమంతా వైసీపీ వేవ్ కొనసాగిన వేళ వల్లభనేని మాత్రం గన్నవరం లో పసుపు జెండా ఎగరవేసారు.
కానీ తర్వాత పరిస్థితులు ప్రతి కూలంగా మారడంతో ఆ పార్టీలో కొనసాగలేదు. తమ పార్టీ నుంచి గెలిచి వైకాపాకి మద్దతి స్తున్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. టెక్నికల్ గా టీడీపీ అయినా మనసంతా వైసీపీపైనే ఉందని ఎద్దేవా చేసారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టేలా వంశీ డెరింగ్ డెసిషన్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ టిక్కెట్ పై గెలవాలన్నది ఆయన వ్యూహం అని చర్చ సాగుతోంది. త్వరలో గన్నవరంలో బైపోల్స్ బెల్స్ మ్రోగించేలా తన మనసులో మాటను సీఎం దృష్టికి తీసుకెళ్లేలా సిద్దం అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఉండలేక ఉండటం కన్నా మళ్లీ గెలిచి వైసీపీ అభ్యర్ధిగా అసెంబ్లీలో అడుగు పెడితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని వంశీ భావిస్తు న్నారుట. దీనికి సంబంధించి వంశీ యాక్షన్ ప్లాన్ కూడా సిద్దం చేసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. గన్నవంరలో ఆయనకు సొంతంగా బలం, బలంగా ఉంది. ముఖ్యమైన టీడీపీ స్థానిక నేతలంతా టచ్ లో ఉన్నారు. ఇక వైకాపాకు మద్దతిస్తున్నప్పటి నుంచి గన్నవరం వైకాపా నేతలు వల్లభనేనికి జై కొడుతున్నారు. వంశీ అనుచరలు ఆయనతో పాటు ఇతర టీడీపీ నేతలకు టచ్ లో ఉన్నారు. ఉప ఎన్నికకు వెళ్తే తన క్యాడర్ కి-వైసీపీ శ్రేణులకి మధ్య ఉన్న గ్యాప్ కూడా తీరిపొతుందన్నది వంశీ ఆలోచనగా తెలుస్తోంది. వీరిద్దరు తోడైతే వంశీ గెలుపు నల్లేరు మీద నడకే అన్నది ఆయన లెక్క అని అంటున్నారు.
వన్స్ సీఎం గ్రీన్ సిగ్నెల్ ఇస్తే వంశీ విక్టరీ నమోదైనట్లేనని ఆయన అనుచరలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ గెలుపు ఒక్కటే ముఖ్యం కాదని వంశీ భావిస్తున్నారుట. టీడీపీ కోటలకు బీటలు కొట్టేలా నాతో వచ్చేది ఎవరు? అన్న చందంగా రహస్య ఎజెండాను వంశీ రూపొందించినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. కరణం బలరాం, మద్దాల గిరి కూడా వంశీ వెళ్తే ఉప ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ముగ్గురు కాదు ఏకంగా ఐదారుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పాత్ లోకి వచ్చేలా పెద్ద స్కెచే వేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే టీడీపీ నుంచి వైసీపీకి వెల్లువ మామూలుగా ఉండదు.