ఎయిడ్స్ పై ప్రపంచ దేశాలు నాలుగు దశాబ్ధలుగా పోరాటం చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఆ జబ్బుకి మందు లేదు. తాత్కాలిక మందులు…జీవితాన్ని పొడిగించుకోవడానికి తప్ప! వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాలేదు. దీంతో నివారణ ఒక్కటే మార్గమమని ప్రపచం దేశాలు చేసిన పోరాటంలో చాలా వరకూ నెగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు గతంతో పోల్చుకుంటే చాలా వరకూ తగ్గాయి. అయితే సంపన్న దేశాలు ఏ దశలోనూ దీనిపై ప్రయోగాలు మాత్రం ఆపలేదు. నాటి నుంచి నేటి వరకూ నాలుగు దశాబ్ధాలుగా మందు కనిపెట్టడం కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. సత్ఫలితాల దిశగా ప్రయోగ అడుగులు పడుతున్నాయని చాలా మంది శాస్ర్తజ్ఞలు అభిప్రాయపడ్డారు.
ఈనేపథ్యంలో ఈ ప్రయోగంలో ఇప్పుడు మందడుగు పడింది అనడం కన్నా! వేగం పెరిగింది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎయిడ్స్ బారిన పడ్డ ఓ వ్యక్తిపై శాస్ర్తవేత్తలు జరిపిన పరిశోధన విజయవంతమైంది. శాస్ర్తవేత్తలు తాజా ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఈ ప్రయోగాన్ని క్లినికల్ ట్రయల్ వైపు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఎయిడ్స్ కి గురైన ఓ వ్యక్తిపై జరిపిన పరిశోధనలలో పలు రకాల మందులతో చికిత్స చేయగా అతను విజయవంతగా ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాడు. ఈమేరకు 23వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్-2020 సైంటిస్టులు తమ పరిశోధన వివరాలు వెల్లడించారు.
హెచ్ ఐవి సోకిన ఓ వ్యక్తిని 2016 లో తీసుకుని సైంటిస్టులు క్లినికల్ ట్రైల్స్ ప్రారంభించారు. 57 వారాల అనంతరం అతనిలో హెచ్ ఐవీ యాంటీ బాడీలు లేవని తేలింది. దీంతో ఆ వ్యక్తి పూర్తిగా హెచ్ ఐవీ నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. అయితే కేవలం ఈ ఒక్క వ్యక్తిపై ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడే ఆయా ఔషధాలను ఎయిడ్స్ చికిత్స కోసం వాడలేమని సదరు సైంటిస్టులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. తాజా ఫలితాల నేపథ్యంలో ఎయిడ్స్ విషయంలో శాస్ర్తజ్ఞుల ఫలితం చాలా వరకూ ముందడుగు పడినట్లే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ వైద్యంలో ఎయిడ్స్ మందులు కూడా వాడుతున్నారు. జ్వరానికి ఎయిడ్స్ మందులిచ్చే తగ్గిస్తున్నట్లు, తద్వారా వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.