కరోనా వైరస్ రావడవంతో ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం అనేది మంట గలిసిపోయింది. అదీ భారతదేశంలో పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉన్నాయి. ఏ కారణంతో చనిపోయినా మనిషిదగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. సాధారణ దగ్గు, తుమ్ము, జ్వరం వచ్చినా కరోనా అంటూ ఆమడ దూరం పరిగెడుతున్నారు. కరోనా రోగి కాకపోయినా వైరస్ సోకిన రోగిలానే చూస్తోంది సమాజం. కరోనాతో చనిపోతో ఆ భౌతిక కాయాల్ని ఎలా పూడ్చిపెడుతున్నారో చూస్తున్నాం ఉన్నాం. డాక్టర్లు శవానికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరీ అంతగా భయపడాల్సిన పనిలేదని చెబుతున్నా! పరిస్థితులు రోజు రోజుకి అంతకంతకు దిగజారిపోతున్నాయి. కేరళ, తెలంగాణ రాష్ర్టాలలలో కరోనా తో చనిపోయిన వారిని ఎలా పూడ్జిపెట్టిన ఆ వీడియోలే పరిస్థితికి అద్దం పట్టాయి.
తాజాగా ఢిల్లీలో ఇంతకు మించిన ఘోరం కలచివేసింది. ఓ అమాయకురాల్ని కరోనా భయంతో కదులుతోన్న బస్సు నుంచి నిర్ధాక్షిణ్యంగా కిందకు తొసేసారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. ఢిల్లీ నుంచి షికోహాబాద్ వెళ్లడానికి అన్షిక యాదవ్(19) అనే యువతి, తల్లి, సోదరుడితో కలిసి బస్సెక్కింది. ఆ సమయంలో అన్షిక అనారోగ్యంగా కనిపించడానికి బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు గమనించారు. ఆ యువతికి కరోనా ఉందంటూ డ్రైవర్ కండెక్టర్ కు తెలపడంతో ప్రయాణికులంతా వెంటనే అమ్మాయిపై దుప్పడి విసిరి సీటు నుంచి పక్కకు లాగి కిందకు తోసేసారు. ఆ సమయంలో బస్సు యమునా ఎక్స్ ప్రెస్ హైవే గుండా వెళ్తోంది.
తోసేసే ఆ సమయంలో ఆ యువతి కుటుంబ సభ్యులు కరోనా లేదని, కిడ్నీ లోపం కారణంగా నీరసంగా ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మృగాల్లా ప్రవర్తించారు. యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కొవిడ్ లేదని, కిడ్నీలో రాళ్లు ఉండటంతో నీరసంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరి చావుకి కారణమైన వారందర్నీ ఉరి తీయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లైనా న్యాయం కోసం పోరాడుతానన్నాడు.