కేసీఆర్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేసిందో ?   

కరోనా వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తూనే ఉంది. ఈ మహమ్మరి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బలతో భయాందోళనకు గురవుతోన్నాయి. పైగా కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాలు సైతం భారీగా నమోదవుతుండటం శోచనీయంగా మారింది. ఇప్పటికే కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అయినా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.

నిజానికి ఈ మహమ్మరి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం… తెలంగాణకే తలమానికంగా నిలిచే భాగ్యనగరమే మహమ్మరి గుప్పిట్లో చిక్కుకోవడం.. జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటంతో ఏం చేయాలో ఎవరికీ ఏమి అర్ధం కావడంలేదు. మరోసారి హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నగరవాసుల నుంచి రోజురోజుకు విజ్ఞఫ్తులు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ జులై 31వరకు రాష్ట్రంలో ఆన్ లాక్ 2.0 ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ లాక్ డౌన్ ఎలా ఉండబోతుంది ? విధివిధానాలు ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు.

రేపు జరగబోయే క్యాబినేట్ సమావేశం హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎలా ఉండబోతుంది ? ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు ? మార్కెట్లు, నిత్యవస వస్తువుల దుకాణాలు ఓపెన్ లో ఉంటాయా లేక వాటిని కూడా
మూసేస్తారా ? అనేది చూడాలి. అయితే జూన్ 3నుంచి 15రోజులపాటు జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం బాగా జోరుగా సాగుతోంది. చాలా కఠిన చర్యలు అమలు చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేసిందో.