కేంద్రంలో బలమైన శక్తిగా అవతరించనున్న వైకాపా

ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో రెండు చోట్లా బలమైన పార్టీగా అవతరించడం అనేది చాలా అరుదుగా జరుగుతుటుంది.  రాష్ట్రంలో ఎంత బలమున్నా కేంద్రంలో పనులు జరుపుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అణకువగా ఉండాల్సిన పరిస్థితి.  ఇందుకు కారణం ఉభసభల్లో పూర్తి బలం లేకపోవడమే.  నిన్న మొన్నటివరకు వైసీపీ సిట్యుయేషన్ ఇదే.  కానీ నిన్నటి రాజ్యసభ ఎన్నికలతో పరిస్థితి కొద్దిగా మారింది.  నాలుగు సీట్లకు జరిగిన పొటీలో వైసీలీ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణలు గెలుపొందారు.  వైసీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓట్లు వేసి తమవారిని గెలిపించుకున్నారు. 
 
దీంతో రాజ్యసభలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిపి 6కు చేరింది.  ఈ సంఖ్య సామాన్యమైనదేమీ కాదు.  ఈ విజయంతో వైసీపీకి ఉభసభల్లో 22 మంది ఎంపీలు, 6గురు రాజ్యసభ సభ్యులు కలిపి 28కి చేరింది.  మొత్తం ఏపీ నుండి 11 రాజ్యసభ స్థానాలు ఉండగా ప్రజెంట్ 6 వైసీపీ, 4 భాజపా, 1 టీడీపీ చేతిలో ఉన్నాయి.  నిజానికి భాజపాకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వేంకటేష్ ముగ్గురూ టీడీపీ నుండి జంప్ అయినవారే.  వీరి పిరాయింపు, తాజా ఓటమితో టీడీపీ ఒక్క సీటుతో మూడవ స్థాయికి పడిపోయింది.  
 
ఇక 2022, 2024కి కొత్తగా ఎన్నికైన నలుగురు కాకుండా మిగతా అందరి పదవీకాలం ముగుస్తుంది.  అప్పుడు ఆ 7 స్థానాలను కూడా కైవసం చేసుకుంటే వైసీపీ బలం ఉభయసభల్లో 33కు చేరుతుంది.  జగన్ ప్లాన్ కూడా ఇదే.  సాధారణంగా ఉభయసభల్లో 30 లేదా అంతకంటే సభ్యులున్న పార్టీకి ప్రాధాన్యం చాలా ఎక్కువ.  అప్పుడు కేంద్రం తప్పక స్నేహ హస్తం చాచాల్సి ఉంటుంది.  అప్పుడు రాష్ట్ర డిమాండ్లను, సమస్యలను సులభంగా పరిష్కరించుకునే వీలుంటుంది.  ఏపీకి ఇప్పటికే బోలెడన్ని కష్టాలున్నాయి.  అనుకున్నట్టే 2024కి వైసీపీ 33 సంఖ్యా బలాన్ని పొందగలిగితే ఉన్న సమస్యల్లో కొన్నైనా పరిష్కారమయ్యే వీలుంటుంది.