కరోనా కోసం  కొత్తరకం  మాస్క్‌ !

కొత్త మలుపు తిరిగిన ఏపీ ర్యాపిడ్ కిట్స్ యవ్వారం!

కరోనా వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తూనే ఉంది. ఈ మహమ్మరి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బలతో భయాందోళనకు గురవుతోన్నాయి. పైగా కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరణాలు సైతం భారీగా నమోదవుతుండటం శోచనీయంగా మారింది. ఇప్పటికే కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ప్రజలందరూ కరోనా పై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీఒక్కరు మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం జీవితంలో భాగమై పోయింది.

అయితే అసలు ప్రస్తుతం వాడుతున్న మాస్కులు ప్రజలను ఎంతమాత్రం కాపాడుతాయనేది పెద్ద ప్రశ్ననే. అయితే ఇజ్రాయిల్ కు చెందిన సోనోవియా తయారు చేసిన మాస్కులు వాడితే మాత్రం కరోనా వైరస్ రాదట. ఇప్పటికే తాము తయారుచేసిన మాస్కును ప్రయోగశాలల్లో ప్రయోగించినట్లు సోనోవియా కంపెనీ పేర్కొంది. ఈ మాస్క్ తయారీలో వాడే ఫ్యాబ్రిక్‌ ను జింక్ ఆక్సైడ్ నానో పార్టికల్స్‌తో కోట్ చేసినట్లు తెలిపింది. దీనికి బ్యాక్టిరియా, ఫంగి, వైరస్ కణాలను అడ్డుకొని చంపేసే శక్తి ఉంటుందని పేర్కొంది.

కాగా ఈ మాస్క్ లోని క్లాత్‌ లో ఉండే ఈ నానో పార్టికల్స్ ఒకరకంగా శానిటైజర్‌గా పనిచేస్తాయని చెప్పింది. మాస్క్‌ వద్దకు వచ్చే అన్ని సూక్ష్మ క్రిములను నాశనం చేసేలా వీటిని రూపొందించినట్లు ప్రకటించింది. మాస్కుల తయారీలో ఈ ఫార్ములా విజయవంతం కావడంతో వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నారు. సోనోవియా సంస్థ ప్రకటించింది. మాస్కులతోపాటు త్వరలోనే దుస్తులను కూడా తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి మాస్కులు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయం.