కరోనా కేసులు అదుపులోకి రావాలంటే.. ?  

 
నెలలు గడుస్తున్నా  దేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. రోజుకు దేశంలో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయంటే   ప్రస్తుత దయనీయ పరిస్థితి అంచనా వెయ్యొచ్చు.  రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే భారత్ కరోనా కేసుల్లో తొలి మూడు దేశాలతో పోటీపడేలా కన్పిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే  తెలంగాణలో కరోనా కేసులు 5 వేల మార్కును దాటాయి.  
 
 
తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 2766 కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 2240 మంది చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నా.. వాస్తవ లెక్కలు వేరు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగే అవకాశం ఉంది.  కొత్త కేసుల సంఖ్య  రానున్న రోజుల్లో రెట్టింపు అవుతుందని ఓ అంచనా. మొత్తానికి కరోనా ఎవరిని వదలేదడం లేదు. కరోనా పై ముందుడి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులకు సైతం మహమ్మరి సోకడం శోచనీయంగా మారింది.
 
కరోనా వారియర్స్ పదుల సంఖ్యల్లో కరోనా బారినపడటంతో ఏమి చేయాలో తెలియడంలేదు. పైగా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా కరోనా వ్యాప్తిని వేగవంతం చేస్తోంది.  అందుకే  ప్రజాప్రతినిధులు, సెలబెట్రీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు కరోనా నుంచి త్రుటిలో తప్పించుకొని హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంకా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇకనైనా  కరోనా కేసులు అదుపులోకి రావాలంటే..  సీఎం కేసీఆర్ సమీక్షలు ఆపి, కఠిన  చర్యలు తీసుకోవాలి.