ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. మహమ్మారి రోజు రోజుకి మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. గణనీయంగా కేసులు సంఖ్య పెరిగిపోతుంది. రోజూ వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు నమెదవుతున్నాయి. మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడిక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కొవిడ్ బారిన పడ్డవారిని సరైన వైద్యం అందించి సురక్షింతంగా తిరిగి ఇంటికి పంపిచాలని..అందుకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కొవిడ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేయాలని అధికారులను ఆదేశించారు.. పేషెట్ల నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదని ఆ బాధ్యత అధికారులదేనని హెచ్చరించారు.
ఇక ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనాకి వైద్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్పోరేట్ యాజమాన్యాన్ని సీఎం హెచ్చరించడం జరిగింది. అయితే ఇలా ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నా కేసులు పెరిగుతుండటంతో ఆసుపత్రుల పరంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులు సరిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గం కూడా సిద్దం చేసి పెట్టుకోవాలని సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు ఓ ఐడియా ఇవ్వడం జరిగింది. మాజీ మఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారం ఈ విషయంలో తీసుకోవాలని…అందుకు చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గం పెద్దలతో మాట్లాడాలని సలహా ఇచ్చారు.
ఎందుకంటే అవసరం అయితే రాష్ర్టంలో ప్రతీ జిల్లాల్లో, ప్రతీ మండలంలో ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందిన కమ్మ భవానాల్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆ మాత్రం బాధ్యత ఆయనపై ఉందని..ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన బాద్యత చంద్రబాబుపై ఉందంటున్నారు. ఆ భవనాలు విశాలంగా..అన్ని రకాల వసతులతో ఉంటాయని, అవసరం మేర ఐసీయూ సెటప్ ఏర్పాటు చేసుకున్నా ఇబ్బంది ఉండదని వైకాపాకు చెందిన కొందరు నేతలు సూచించారు. మరి చంద్రబాబు ఏమంటారో.