ఇటీవలే అదిలాబాద్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు జేబీఎస్ లో టీఎస్ ఆర్టీసీ బస్సెకి అదిలాబాద్ కి ప్రయాణించిన ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ముగ్గురుకి కరోనా సోకిందని తెలిసి కూడా బాధ్యత లేకుండా ఆ బస్సులో ప్రయా ణించారు. ఈ ఘటన తెలియడంతో ఆ బస్సులో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. తాజాగా అలాంటి ఘటన ఏపీలో విజయవాడ బస్సు డిపో పరిధి లో చోటు చేసుకుంది. జగ్గయ్య పేటకు చెందిన ఓ 65 ఏళ్ల వృద్ధురాలు జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లింది. ఆ తర్వాత ఈనెల 6వ తేదీని అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ ఉన్నట్లు 12వ తేదని తేలింది.
దీంతో ఆ వృద్ధిరాల్ని విజయవాడ ఆసుపత్రికి రావాల్సిందిగా సమాచారం అందించారు. కాగా సోమవారం సాయంత్రం ఆమెను అంబులెన్స్ లో విజయవాడ అసుపత్రికి తరలించడం జరిగింది. కానీ అక్కడికి వెళ్లాక బెడ్లు లేవని..హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు. ఈ విషయాన్ని కుమారుడికి చెప్పగా అతగాడు ప్రయివేట్ కోసం ట్రై చేసాడు. కానీ కరోనా పేషెంట్ అనగానే ఏ వాహన దారుడు ముందుకురాలేదు. దీంతో ఆ వృద్ధురాలు ఆ రాత్రంతా విజయవాడ ఆసుపత్రి ఆవరణలోనే పడుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం అంటే మంగళవారం ఆటోలో విజయవాడ బస్టాండ్ కు వెళ్లి బస్సెక్కి జగ్గయ్య పేటకు ప్రయాణించింది.
అప్పటికే గ్రామస్థులకు ఈ విషయంలో తెలియడం…ఆ అవ్వ బస్సు దిగడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. అయితే ఈ వ్యవహారంలో మొత్తం తప్పంతా ఆసుపత్రి సిబ్బందిదేనని తేలడంతో బంధువులు గొడవకు దిగారు. చివరికి పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. ఇంత వరకూ బాగానే ఉంది. ఇప్పుడా బస్సులో ఎంత మంది ప్రయాణించారు? ఎంత మందికి కరోనా సోకింది? అన్న టెన్షన్ అధికారుల్లో మొదలైంది. జిల్లా యంత్రాంగం ఇప్పుడా ప్రయాణికుల జాడ కోసం అన్వేషిస్తున్నారు. ఈ విషయం తెలిస్తే ప్రయాణించిన వారంతా బెంబేలెత్తిపోక తప్పదు.