తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ కనబడకపోవడంపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. శనివారం ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోయాయి. గత రెండు వారాలుగా కేసీఆర్ కనిపించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు, ప్రజలు కరోనాతో జీహెచ్ ఎంసీ బెంబేలెత్తిపోతుంటే? కేసీఆర్ ఎక్కడికి వెళ్లిపోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనాతో రాష్ర్టంలో పరిస్థితితులు అదుపుతప్పుతోన్న నేపథ్యంలో రాష్ర్టపతి పాలన విధించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేసారు.
ఇంత జరుగుతున్నా కేసీఆర్ జాడ కానరాలేదు. ఆ పార్టీ మంత్రులు కూడా ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని చెప్పకుండా విమర్శలు తిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. దీంతో ఆయనకు కరోనా సోకిందని హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని ఓ పత్రిక సైతం ప్రచారం చేసింది. ఇక వెబ్ మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కించాయి. నెటి జనులు సైతం కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఫేస్ బుక్, ఇన్ స్టా , ట్విటర్ వంటి మాధ్యమాల ద్వారా ప్రశ్నించారు. ఎక్కడున్నా ఆయన వెంటనే బయటకు రావాలని డిమాండ్ చేసారు. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగారు. వేర్ ఈజ్ మై కేసీఆర్…ఇది మాహక్కు అంటూ ఏకంగా ఇద్దరు అభిమానులైతే ప్రగతి భవన ముందు నిరసనకే దిగారు.
చివరికి వాళ్లిద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా తేలడంతో వాళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తీన్మార్ మల్లన్న కూడా వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితి పై సందేహం వ్యక్తం చేసారు. దీనిపై హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసారు. ఈ వ్యాజ్యం శుక్రవారం బెంచ్ కి వస్తుందని ఆశించారు. కానీ రాలేదు. దీనికి బధులుగా కేసీఆర్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఏదైనా తెలియజేయాలంటే సంబంధిత యంత్రాంగం ముందుకొస్తుందని సీజే రాఘవేంద్ర సింగ్ తెలిపారు. అయితే వీటన్నింటికి నేటి తో కేసీఆర్ ప్రగతి భవన్ కు రావడంతో పుల్ స్టాప్ పడింది.