ఇండియాని అన్ లాక్  చేయడమే బెటర్ !

 
లాక్ డౌన్ నిబంధనలు ప్రధాని మోడీ సడలించాకే  దేశంలో కేసుల సంఖ్య ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.  రోజురోజుకు కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి.   దీంతో  కరోనా ఎలా కట్టడి చేయాలో తెలియక మోడీ సర్కార్ చేతులెత్తేసింది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాలు అంతా రోడ్డెక్కడం.. ఉద్యోగాలు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. అందరూ బయటకు రావడం.. కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకోకపోవడం.. మాస్క్ లు, శానిటైజర్లు వంటివి వాడకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తి దేశంలో పెరిగిపోతోంది. ఇక పాజిటివ్ వచ్చాక 14 రోజులకు లక్షణాలు బయటపడుతున్నాయి. కానీ ఆ వైరస్ సోకిన వ్యక్తి ఈ 14 రోజుల్లో వందల మందికి వైరస్ అంటించేస్తున్నాడు. ఇది కూడా దేశంలో వైరస్ కేసులు భారీగా పెరగడానికి కారణమవుతోంది.

ఇక ఇతర రాష్ట్రాలకు పని నిమిత్తం వెళ్లిన వలస కార్మికులు వైరస్ ను వెంటబెట్టుకొని సొంతూళ్లకు రావడం కూడా వైరస్ పెరగడానికి కారణమవుతోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఇప్పుడు కరోనా చిచ్చు రేపుతోంది.  ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో సామాజిక వ్యాప్తి దశలోకి వచ్చింది. ఎవరి నుంచి.. ఎక్కడి నుంచి ఎవరికి సోకుతుందనేది చెప్పడం కష్టం. సో ఇక నుంచి కంటైన్మెంట్ జోన్లు పెట్టడం.. మొత్తం ఆ వీధులు, గ్రామాలు లాక్ డౌన్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నది. కాబట్టి ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే ఆ వీధి, గ్రామ ప్రజలంతా కంటైన్మెంట్లతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
 

 
ఇప్పుడు దేశంలో కరోనా కేసులు  లక్షలు దాటుతున్న దృష్ట్యా   ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ సంస్థలకు అనుమతులు ఇచ్చి రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కు సైతం అనుమతులు రద్దు చేయాలని   డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
సడలింపులతో  ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లో పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతారు. ఇప్పటికే వైరస్ విస్తృతి పెరుగుతున్న దృష్ట్యా మోడీ సర్కార్ దేశాన్ని అన్ లాక్  చేయడమే బెటర్.